e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home జిల్లాలు సద్దుల బతుకమ్మ సంబురాలు

సద్దుల బతుకమ్మ సంబురాలు

  • ఉత్సాహంగా ఆడిపాడిన మహిళలు
  • జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సందడి
  • అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు

మెదక్‌, అక్టోబర్‌ 13 : తెలంగాణకు తలమానికమైన పండుగ బతుకమ్మ, మహిళలు ఎంతో ప్రేమించే పం డుగ బతుకమ్మ. ప్రకృతిని ఆరాధించడం, పూలను పూ జించడం ఒక్క బతుకమ్మ పండుగలోనే కనిపిస్తుంది. తమ మనోభావాలను పాట ల రూపంలో వెల్లడించడం, తమ అభీష్టాలను వ్యక్తపర్చడం ఈ పం డుగ ప్రత్యేకత. ప్రతి ఇంటి నుంచి బతుకమ్మను ఎత్తుకొని ఆడపడుచులు బైలెళ్లుతారు. అందరూ ఒక చోట చేరి ఆడిపాడుతారు. తమ కష్టసుఖాలను అందరూ కలిసి పాట రూపంలో పంచుకుంటారు. అమావాస్య నుంచి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులు ఆడిపాడిన మహిళలు.. చివరి రోజైన సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటారు.

మెదక్‌ జిల్లాలో ఘనంగా వేడుకలు..

- Advertisement -

సద్దుల బతుకమ్మ సంబురాలను మెదక్‌ జిల్లా ప్ర జలు ఆనందోత్సాహాల మధ్య అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు. చివరి రోజు పెద్ద ఎత్తున బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ మహిళలు చేరి పాటలు పాడు తూ లయబద్ధంగా ఆటలు ఆడారు. జిల్లా కేంద్రమైన మెదక్‌ పట్టణంలోని రామాలయం, చిల్డ్రన్స్‌ పార్కు, జంబికుంట, ఫత్తేనగర్‌, బాలాజీమఠం, హౌసింగ్‌బోర్డు, వెం కట్రావ్‌నగర్‌ కాలనీ, చమన్‌ తదితర చోట్ల సద్దుల బతుకమ్మ వేడుకల్లో పెద్ద ఎత్తున మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. జిల్లాలోని రామాయంపేట, తూప్రాన్‌, మనోహరాబాద్‌, చేగుంట, నిజాంపేట, నర్సాపూర్‌, హవేళీఘణాపూర్‌, పాపన్నపేట, టేక్మాల్‌, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, రేగోడ్‌, కౌడిపల్లి, కొల్చా రం, చిలిపిఛేడ్‌, శివ్వంపేట, మాసాయిపేట, వెల్దుర్తి మండలాల్లోనూ సద్దుల బతుకమ్మ సంబరాలు జోరుగా సాగాయి. చీకటిపడే సమయానికి సమీపంలోని చెరువులు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఎల్లిరా బతుకమ్మ.. ఎల్లిరావమ్మా అంటూ మహిళలు సాంప్రదాయబద్ధంగా సాగినంపారు. అల్లాదుర్గం మం డల చేవెళ్ల గ్రామం లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో అందోల్‌ ఎమ్మెల్మే చంటి క్రాంతికిరణ్‌ సతీమణి పద్మావతి, జడ్పీటీసీ సౌందర్య, మహిళలు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement