రూ.76లక్షలతో అభివృద్ధి పనులు
ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లెప్రకృతి వనం
గ్రామంలో ఎల్ఈడీ లైట్ల వెలుగులు
పల్లెప్రగతితో మారిన గ్రామం రూపు రేఖలు
మిరుదొడ్డి, ఏప్రిల్ 4 : ఒక్కప్పుడు గ్రామంలో ఎక్కడ చూసినా మురుగు నీటితో నిండిన కాల్వలు, పాడుబడిన పాత బావులు, బల్లి పాతరతో పనికి రాని పిచ్చి చెట్లు, శిథిలావస్థలో పాత ఇండ్లు, గ్రామం మధ్యనే పెంట కుప్పలు, వీధుల్లో చెత్తా చెదారం ఇలా నిత్యం పల్లెలో దర్శనమిచ్చేవి. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లెప్రగతితో అల్వాల గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. స్వచ్ఛత దిశగా అడగులు వేస్తూ.. దశాబ్దాలుగా గ్రామంలో పేరుకు పోయిన సమస్యలన్నీ ఒకేసారి ప్రల్లెప్రగతితో పరిష్కారం కావడంతో అల్వాల గ్రామం రూపు రేఖలే మారిపోయాయి. అల్వాలలో ఏండ్ల నాటి నుంచి ప్రజలకు వివిధ రకాల వ్యాధులకు కారణమైన మురుగు కాల్వలను శుభ్రం చేశారు. బల్లి పాతరలో పనికిరాని పిచ్చి చెట్లను తొలగించారు. శిథిలావస్థలో ఉన్న పాత ఇండ్లను కూల్చివేశారు. పాడుబడ్డ పాత బావులను రూ.6నిధులతో పూడ్చి వేశారు. దీంతో గ్రామం మొత్తం పరిశుభ్రంగా మారి అల్వాల అందంగా మారిపోయింది.
రూ.76లక్షల నిధులతో అభివృద్ధి పనులు..
గ్రామంలోని 5, 6, 8వ వార్డుల్లో రూ.18లక్షలతో సీసీరోడ్లను వేశారు. 3, 4, 6, 9, 10వ వార్డుల్లో రూ.20లక్షలతో నూతన మురుగు కాల్వలను నిర్మించారు. రూ.15లక్షలతో వైకుంఠధామం, రూ.20 లక్షలతో రైతువేదిక భవన నిర్మాణం, రూ.3లక్షలతో బాల వికాస వాటర్ ప్లాంట్‌ను నిర్మించారు.
పంచాయతీ ట్రాక్టర్‌తో చెత్త సేకరణ..
ప్రతి రోజూ గ్రామంలోని చెత్తాచెదారాన్ని పంచాయతీ ట్రాక్టర్‌తో పారిశుధ్య కార్మికులు ఇంటింటికీ తిరుగుతూ తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నా రు. డంపింగ్ యా ర్డుకు తరలించిన చెత్తను సేం ద్రి య ఎరువుగా మా రుస్తున్నారు.
అందంగా పల్లెప్రకృతి వనం..
గ్రామస్తులకు, వృద్ధులకు, పిల్లలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో సేదతీర్చుకోవడానికి గ్రామంలోని ఎకరం భూమిలో రూ.4లక్షలతో పల్లెప్రకృతి వనాన్ని నిర్మించారు. పల్లె ప్రకృతివనంలో ప్రజలను ఆకట్టుకునేలా హైకాస్, సూడో క్రిపాస్, స్టిల్ ఫ్రేమ్, గోల్డెన్ సైకన్, ఫ్లవర్ రింగ్స్, రాయల్ ఫ్లమ్, డెర్జినియా, ఫౌండ్ టెబుల్ ఫ్లస్, ఇకో సైకస్, పెండియం వంటి మొక్కలతో పాటు వివిధ రకాల 4వేలు మొక్కలు నాటడంతో ఎంతో చూడముచ్చటగా కన్పిస్తున్నది పల్లె ప్రకృతివనం.
ఇవి కూడా చదవండి
లవ్ ట్రాక్ గురించి చెప్పిన అంజలి
వకీల్ సాబ్ ఫస్ట్ డే టికెట్ బుకింగ్స్ ఖతం
సెక్స్ కోసం నన్ను వేధించారు: సల్మాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ