e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home జిల్లాలు కాంగ్రెస్‌, బీజేపీతోనే..అభివృద్ధికి ఆటంకం

కాంగ్రెస్‌, బీజేపీతోనే..అభివృద్ధికి ఆటంకం

కాంగ్రెస్‌, బీజేపీతోనే..అభివృద్ధికి ఆటంకం

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రెండేండ్లలో ‘కరివెన’ పనులు పూర్తి చేసి నీరందిస్తాం
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

మూసాపేట, ఏప్రిల్‌ 12 : జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ఆటంకంగా మారారని దేవరకద్ర ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి దుయ్యబట్టారు. సోమవారం మండలంలోని దాసరిపల్లి గ్రామంలో మురుగుకాల్వ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం పల్లెప్రకృతి వనాన్ని ప్రారంభించి నర్సరీని పరిశీలించారు. అదేవిధంగా వేముల గ్రామం లో పల్లెప్రకృతి వనంతోపాటు, జేపీఎన్‌సీఈ చైర్మన్‌ రవికుమార్‌ ఆధ్వర్యంలో నెహ్రూ యువజన కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అనంతరం వేములకు చెందిన నలుగురికి, దాసరిపల్లికి చెందిన ఒకరికి రైతుబీమా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల ఇబ్బందులు, సాగునీటి అవసరాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి పనులకు నిధులు తీసుకొస్తుండగా.. మన జిల్లాకు చెందిన కాంగ్రెస్‌, బీజే పీ నాయకులు మాత్రం పనులను ఎలాగైనా అడ్డుకోవాలని కోర్టుల్లో కేసులు వేస్తున్నారన్నారు. అలాగే కేంద్రానికి లేఖలు రాస్తూ అభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మరో రెండేండ్లలో కరివెన రిజర్వాయర్‌ పనులను పూర్తి చేసి ప్రతి గ్రామానికీ సాగునీరు అందించి తీరుతామని ఎమ్మెల్యే ఆల చెప్పారు. నియోజకవర్గంలోని యువతీ యువకులు కష్టపడి చదువుకొని ఉద్యోగాలు సాధించాలని, ఇందుకు తమ ప్రోత్సాహం ఎప్పు డూ ఉంటుందన్నారు. అదేవిధంగా అన్ని గ్రామాల్లో పేదలకు డబుల్‌బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. సీసీరోడ్లు, కమ్యూనిటీహాల్‌ నిర్మాణాలకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.


చెక్‌డ్యాంల పనులు త్వరగా పూర్తి చేయాలి
చెక్‌డ్యాంల నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని సంకలమద్ది, కొమిరెడ్డిపల్లి, నిజాలాపూర్‌ గ్రామాల సమీపంలోని పెద్దవాగులో రూ.5.35 కోట్లతో చేపట్టనున్న చెక్‌డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాగు పొడవునా నీరు నిల్వ ఉండేలా చెక్‌డ్యాంల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. చెక్‌డ్యాం ఎ త్తు తగ్గితే నిర్మించినా ఉపయోగం ఉండదన్నారు. ఒక చెక్‌డ్యాంలో నిల్వఉన్న నీరు మరో చెక్‌ డ్యాం వరకు నిల్వ ఉండేలా రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు. అవసరమైతే చెక్‌డ్యాంల నిర్మాణ అనుమతులను సరవణ చే యిస్తామని చెప్పారు. చెక్‌డ్యాంల నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షించి వర్షాలు కురిసేలోగా పనులను పూర్తి చేయించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమాల్లో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, జేపీఎన్‌సీఈ చైర్మన్‌ రవికుమార్‌, జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్‌, ఎంపీపీ గూపని కళావతీకొండయ్య, వైస్‌ఎంపీపీ రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్‌, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, తాసిల్దార్‌ మంజుల, ఈఈ చక్రధర్‌, డీఈ కృష్ణ, ఏఈ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
కాంగ్రెస్‌, బీజేపీతోనే..అభివృద్ధికి ఆటంకం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement