e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home జిల్లాలు అభివృద్ధి పథంలో చిన్నపీరుతండా

అభివృద్ధి పథంలో చిన్నపీరుతండా

అభివృద్ధి పథంలో చిన్నపీరుతండా

పురాతన గ్రామపంచాయతీకి దీటుగా నూతన పంచాయతీ
బిజినేపల్లి, ఫిబ్రవరి 3 :మండలంలోని చిన్నపీరు తండా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. పాత గ్రామపంచాయతీలకు దీటుగా రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ ఈ పంచాయతీ అభివృద్ధి చెందుతున్నది. డాక్‌తండా, దాస్‌తండా, ఫుల్‌సింగ్‌తండా, తాట్రావత్‌తండా, హనుమానాయక్‌తండా, రాంసింగ్‌ తండాలు కలుపుకొని చిన్నపీరుతండాను గ్రామపంచాయతీగా ఏర్పాటుచేశారు. ఈ జీపీ మొత్తంలో 707 మంది జనాభా ఉండగా ఇందులో పురుషులు 349, మహిళలు 356 మంది ఉన్నారు. మొత్తం 470మంది ఓటర్లున్నారు. కాగా ఫుల్‌సింగ్‌తండా, చిన్నపీరుతండాల్లో ప్రాథమిక పాఠశాలలున్నాయి. జీపీలో 10గుంటల విస్తీర్ణంలో రూ.3లక్షల వ్యయంతో పల్లె ప్రకృతివనాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా పల్లెప్రగతి ప్రణాళికలో భాగంగా మూడు ట్రాన్స్‌ఫార్మర్లు, 30విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేశారు. ఈసారి మిషన్‌భగీరథ వాటర్‌ ట్యాంకులను ఏర్పాటుచేసి ఇంటింటికీ నల్లా బిగించారు. శ్మశాన వాటిక, డంపింగ్‌యార్డు పనులను పూర్తి చేశారు. డాక్‌తండాలో రూ.మూడులక్షలతో 90మీటర్ల సీసీ రోడ్డు వేశారు. ఐదు కిలోమీటర్ల మేర మట్టిరోడ్డు, ఈజీఎస్‌ ద్వారా రైతులు పొలాలకు వెళ్లేందుకు మట్టిరోడ్లను కూడా ఏర్పాటు చేశారు. హెల్త్‌ సబ్‌సెంటర్‌ కోసం గ్రామపంచాయతీ నుంచి స్థలాన్ని కేటాయించారు. 110 ఎల్‌ఈడీ లైట్లను జీపీ నిధుల నుంచి తండాల్లో వేశారు. ప్రధానంగా తండావాసులకు మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో ఆరు బోర్లల్లో మోటర్లు బిగించి నీటిని సరఫరా చేస్తున్నారు.
తండా అభివృద్ధే లక్ష్యం
చిన్నపీరు గ్రామపంచాయతీలోని తండాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. చిన్న గ్రామపంచాయతీ అయినా ప్రజలకు అన్ని విధాలా వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. తండా అభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరిస్తున్నారు.

  • సాలి, సర్పంచ్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అభివృద్ధి పథంలో చిన్నపీరుతండా

ట్రెండింగ్‌

Advertisement