e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home జిల్లాలు పచ్చదనం పెంచి..ప్రాణులను సంరక్షించి..

పచ్చదనం పెంచి..ప్రాణులను సంరక్షించి..

పచ్చదనం పెంచి..ప్రాణులను సంరక్షించి..

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 11 రేంజ్‌లు
రూ. 32 లక్షలతో నీటి వనరుల ఏర్పాటు
పర్క్యులేషన్‌ ట్యాంకులు, సోలార్‌ పంపులు, రాళ్ల కట్టల నిర్మాణాలు
కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మార్చి 26 (నమస్తే తెలంగాణ): కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో అడవుల శాతాన్ని పెంచడంతో పాటు వన్యప్రాణులను సంరక్షించేందుకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ఈ మేరకు ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ ఫారెస్ట్‌ డివిజన్ల పరిధిలో నీటి వనరులను పెంపొందించేందుకు రూ. 32 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు ఖర్చు చేస్తున్నది. పర్క్యులేషన్‌ ట్యాంకులు చెక్‌డ్యాంలు, రాక్‌ఫిల్‌ డ్యాం (రాళ్ల కట్టలు) తదితర నిర్మాణాలు చేపట్టింది. తద్వారా పచ్చదనం.. అడవుల విస్తీర్ణం పెరగడంతో పాటు వేసవిలో వన్యప్రాణుల తాగు నీటి గోస తీరనున్నది.

జిల్లాలో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ ఫారెస్ట్‌ డివిజన్ల పరిధిలో 11 అటవీ రేంజ్‌లు ఉన్నాయి. జిల్లాలో అటవీ ప్రాంతం 2445.40 చ.కిమీ విస్తీర్ణంలో ఉంది. వీటి పరిధిలో వర్షపు నీరు వృథా పోకుండా అడ్డుకట్ట వేసి భూ గర్భ జలాలను పెంపొందించేందుకు అటవీ శాఖ చర్యలు చేపట్టింది. ఇందు కోసం రూ. 32 లక్షలతో నీటి సంరక్షణ పనులు చేపడుతున్నారు. జిల్లాలోని అటవీ ప్రాంతంలో 164 పర్క్యులేషన్‌ ట్యాంకులను గతేడాది నిర్మించగా, ఈ ఏడాది ఇప్పటి వర కు 80 ట్యాంకులు నిర్మించారు. ఒక్కో ట్యాంకు నిర్మాణానికి రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఖర్చుచేశారు. పర్క్యులేషన్‌ ట్యాంకులు అడవుల్లో భూగర్భ జలాల పెంపునకు ఉపయుక్తంగా మారాయి. అదే విధంగా 201 రాక్‌ఫిల్‌ డ్యాంలు నిర్మించారు. ఒక్కోదానికి రూ. 8 వేలు ఖర్చుచేశా రు. ఇవేకాకుండా 7 చెక్‌డ్యాంలు, 5 సోలార్‌ పంపు సెట్లను ఏర్పాటు చేశారు. వీటిలో గతంలో 3 పంపుసెట్లను ఏర్పా టు చేయగా, ఈ ఏడాది కొత్తగా 2 పంపుసెట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో పంపుసెట్‌కు రూ. 4 లక్షలు ఖర్చు చేశారు. ఈ అడవుల్లో యేటా హరితహారం ద్వారా మొక్కలను నాటడంతో పాటు సహజ పద్ధతుల్లో మొక్కలు పెరిగేలా అటవీ శాఖ చర్యలు చేపడుతున్నది. ఇటీవల జిల్లాలో పులుల సం చారం పెరిగింది. వన్యప్రాణలు, ఇతర శాకాహార జంతువు లు పెరిగాయి. అడవుల్లో వర్షపు నీరు వృథాగా పోవడంతోపాటు, కొండ ప్రాంతాల్లో కురిసిన వర్షం కిందికి ప్రవహిస్తుండడంతో, భూములు కోతకు గురవుతుంటాయి. ఇలాం టి వాటిని నివారించేందుకు ఏటవాలు ప్రాంతాల్లో రాళ్ల కట్టలు, పర్క్యులేషన్‌ ట్యాంకులు నిర్మిస్తున్నారు. అడవులు సహజసిద్ధంగా పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. సోలా ర్‌ పంపుల ఏర్పాటుతో పర్క్యులేషన్‌ ట్యాంకుల్లో నిరంతరం నీరు అందుబాటులో ఉండేలా అటవీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

భూగర్భ జలాల పెంపుతో అడవులకు మేలు
అడవుల్లో భూగర్భ జలాలను అభివృద్ధి చేస్తే, సహజ సిద్ధమైన అడవులు పెరుగుతాయి. అడవుల్లో రాళ్ల కట్టలు, పర్క్యులేషన్‌ ట్యాంకులు ఏర్పాటు చేయడం ద్వారా భూమి కోతకు గురికాకుండా ఉంటుంది. సోలార్‌ పంపులతో అడవుల్లో జంతువులకు కావాల్సిన నీరు ఎల్లప్పు డూ అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల మేర కు జిల్లాలో అడవుల శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

  • శాంతారాం, జిల్లా అటవీ అధికారి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పచ్చదనం పెంచి..ప్రాణులను సంరక్షించి..

ట్రెండింగ్‌

Advertisement