ప్రమాదాలు నివారించడానికి అవకాశం
వాహనాల వేగాన్ని అదుపు చేయడానికి ‘స్పీడ్ గన్’
కేసుల నమోదు వల్ల నేరాల రేటు తగ్గుదల
ఈ చలాన్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ వర్టికల్ ఇన్చార్జి చంద్రమోహన్‌రావు
నారాయణపేట, ఏప్రిల్ 15 : వాహనాల ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను హాట్ స్పాట్లుగా గురించడం వల్ల ప్రమాదాలు నివారించడానికి అవకాశం ఉంటుందని ఈ పెట్టి, ఈ చలాన్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ వర్టికల్ ఇన్చార్జి చంద్రమోహన్‌రావు అన్నారు. జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి గురువారం ఒకరోజు ఆన్లైన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ వాహనాల వేగాన్ని అదుపు చేయడానికి స్పీడ్ గన్ ద్వారా కేసులు నమోదు చేసి ప్రమాదాలు నివారించడానికి చర్యలు చేపట్టాలన్నారు. ఈ చలాన్, ఈ పెట్టి కేసు లు నమోదు చేయడం ద్వారా నేరాల రేటు తగ్గించేందుకు అవకాశం ఉంటుందని పే ర్కొన్నారు. జన సామ్య ర్థం ఉన్న ప్రదేశాల్లో న్యూ సెన్స్ క్రియేట్ చేసే వారి పై, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజలకు ఇబ్బందులు గురి చేసే వా రిపై షాపుల ముందు రో డ్డుపై వాహనాలు పార్కింగ్ చేసే వారిపై ఈ పెట్టి కేసులు నమోదు వల్ల ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు వీలుంటుందని, అదేవిధంగా అలాంటి వారికి త్వరితగతిన శిక్షలు పడేలా చేయడంతో పెద్ద నేరాలు జరుగుకుండా చూడవచ్చన్నారు. వాహనాల తని ఖీ సమయంలో ప్రతిఒక్కరూ ఆర్సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్, హెల్మెట్లను విధిగా చెక్ చేయాలన్నారు.
డయల్ 100 కాల్స్‌పై వెంటనే స్పందించి ప్రమాద స్థ లానికి చేరుకొని బాధితులకు సహాయం అందించాలన్నా రు. మాస్కులు లేకుండా బయట తిరిగే వారికి ఈ చలాన్ ద్వారా రూ.1000 జరిమానా విధించాలన్నారు. మాస్కుల ఉపయోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. శిక్షణలో జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.