e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, April 11, 2021
Advertisement
Home జిల్లాలు జిల్లాభివృద్ధికి సమిష్టిగా పాటుపడాలి

జిల్లాభివృద్ధికి సమిష్టిగా పాటుపడాలి

జిల్లాభివృద్ధికి సమిష్టిగా పాటుపడాలి

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు
అప్రమత్తంగా ఉంటూ ధాన్యం సేకరించాలి
మే రెండో వారంలో సీఎం కేసీఆర్‌ రాక
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి రూరల్‌, ఏప్రిల్‌ 8 : జిల్లాభివృద్ధికి అధికారు లు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా పాటుపడాలని వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎంవైఎస్‌ ఫంక్షన్‌ హాల్‌లో జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి అధ్యక్షతన జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి మంత్రి ని రంజన్‌రెడ్డి, కలెక్టర్‌ షేక్‌యాస్మిన్‌ బాషాతో హాజరయ్యా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాలాభివృద్ధికి ప్రభుత్వం అధికంగా నిధులు విడుదల చేస్తుంద ని, వాటితో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందు కు సాగాలన్నారు. కిడ్నీ బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు మరో ఐదు డయాలసిస్‌ యూనిట్లను మంజూరు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు. 45 ఏండ్లు పైబడిన వారు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని సూచించారు. జిల్లాలో నిరంతరం మిషన్‌ భగీరథ నీటి సరఫరా చేయడం అభినందనీయమన్నారు. పలు ప్రాంతాల్లో మిషన్‌ భగీరథ పనులు చేస్తున్న ఏజెన్సీలు పనులు వేగవంతం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీల్లో నిధుల వినియోగంపై గ్రామ సభ నిర్వహించుకోవాలని చెప్పారు. పల్లెప్రకృతి వనాలను సుందరంగా తీర్చిదిద్దాల ని, నర్సరీల్లో అవసరం మేరకు మొక్కలను సిద్ధం చేయాలని, సెగ్రిగేషన్‌ షెడ్డును వినియోగంలో తీసుకొచ్చి కం పోస్టు ఎరువును తయారుచేయాలన్నారు.

రైతు వేదికల ద్వారా వ్యవసాయ సాగు సాంకేతిక విషయాలు తెలియజేయాలన్నారు. రైతుల సమావేశంలో విద్యుత్‌, ఉపాధి అధికారులను కూడా సమన్వయం చేసుకోవాలన్నారు. కంది పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. యాసంగిలో వరి కంటే కందులు, పత్తి, తృణధాన్య పంటలను సాగు చేసేలా వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ధాన్యాన్ని ఎఫ్‌సీఐ కొనుగోలు చేసే పరిస్థితి లేకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు కృషి చేస్తుందన్నారు. పంట నిల్వ కోసం జిల్లా కు మరో ఏడు గోదాంలను మంజూరు చేయించామని తెలిపారు. ఈ ఏడాది రూ.7 వేల నుంచి రూ.8 వేల పైనే వేరుశనగ ధర పలికిందన్నారు. ఈ ఏడాది దరఖాస్తు చే సుకున్న ప్రతి రైతుకూ స్ప్రింక్లర్లు అందిస్తామన్నారు. కాలువ, ఇతర పనులు చేపట్టి ఉపాధి కూలీలను ఆదుకోవాలన్నారు. ఆయిల్‌పాం తోటల పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులను వ్యవసాయ క్షేత్రాలకు అధికారులు తీసుకెళ్లి వాటి పరిస్థితులను వివరించాలని సూచించారు.

ప్రతి మండలం నుంచి ఒక బస్సు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మే రెండో వారంలో సీ ఎం కేసీఆర్‌ వనపర్తికి రానున్నరని, కొత్తగా నిర్మించిన కలెక్టరేట్‌, ఎమ్మెల్యే క్యాంపు భవనాలను ప్రారంభిస్తారని తెలిపారు. జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా మాట్లాడుతూ వచ్చే వారం నుంచే జిల్లాలో 223 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టనున్నట్లు వివరించారు. జిల్లా అభివృద్ధికి మంత్రి చేస్తున్న కృషి గొప్పదన్నారు. వ్యవసాయ సాగుపై అధికారులు మరింత దృష్టి సారించాలన్నారు. జిల్లా సమస్యలను మంత్రి సహకారం తో పరిష్కరించుకుందామన్నారు. కార్యక్రమంలో అదన పు కలెక్టర్‌ వేణుగోపాల్‌, జెడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి, ఆర్డీ వో అమరేందర్‌, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ లక్ష్మ య్య, గొర్రెల కాపరుల సంఘం జిల్లా చైర్మన్‌ కురుమూర్తి యాదవ్‌, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ జగదీశ్వర్‌రె డ్డి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణం.. ఓపాడ్స్‌ను ప్రారంభించిన తెలంగాణ బాలిక

93 మందికి ఉద్యోగ నియామ‌క ప‌త్రాలు అందించిన మంత్రి కేటీఆర్

టాలీవుడ్‌పై క‌న్నేసిన మ‌రో క‌న్న‌డ హీరో..ఫ‌స్ట్‌లుక్‌

Advertisement
జిల్లాభివృద్ధికి సమిష్టిగా పాటుపడాలి

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement