e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home జిల్లాలు బాలికలకు పోక్సో రక్ష

బాలికలకు పోక్సో రక్ష

 • వేధిస్తే జైలు జీవితమే శరణ్యం..
 • ఏడేండ్లు లేదా జీవిత ఖైదు విధించే అవకాశం
 • చట్టంపై అవగాహన లేని యువత
 • వరుస సంఘటనలతో బలవుతున్న చిన్నారులు

వేధిస్తే జైలు జీవితమే శరణ్యం..

 • ఏడేండ్లు లేదా జీవిత ఖైదు విధించే అవకాశం
 • చట్టంపై అవగాహన లేని యువత
 • వరుస సంఘటనలతో బలవుతున్న చిన్నారులు

ప్రేమ పేరుతో బాలికలను మోసగించడం.. లైంగిక వేధింపులకు పాల్పడడం.. అనుచితంగా ప్రవర్తించడం.. అభద్రతా భావం కలిగించడం నేరం.. ఇలాంటి వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం పోక్సో చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ఎంత కఠినంగా ఉందో తెలియని యువత అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. అత్యాచారాలకు పాల్పడుతూ జైలు పాలవుతున్నారు. చదువుకొని ఉన్నతంగా ఎదగాల్సిన వయస్సులో జైలుపాలవుతున్నారు. ఈ పోక్సో చట్టం బాలికలకు రక్షగా మారుతున్నది.

 • మహబూబ్‌నగర్‌ మెట్టుగడ్డ, సెప్టెంబర్‌ 28
- Advertisement -

విలువైన భవిష్యత్‌ నాశనం..

బాలికలను ప్రేమించి చాలా మంది యువత జైలులో గడుపుతున్నారు. పోక్సో చట్టంపై అవగాహన లేక ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. బాలికలను ప్రేమ పేరుతో తీసుకెళ్లి వివాహం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లినట్లు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. చట్ట ప్రకారం తల్లిదండ్రుల ఫిర్యాదును మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఈ క్రమంలో కేసులు నమోదు చేసి యువకులను జైళ్లకు పంపిస్తున్నారు. చిన్న వయస్సులో ఇంట్లో నుంచి వెళ్లిపోయి వివాహాలు చేసుకున్న వారిలో ఎక్కువ మంది యువకులు తరువాత వదిలించుకోవడానికి ప్రయత్నించడంతో బాలికల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతున్నది. బాలికలు కూడా ఈ విషయంపై అవగాహన కలిగి ఉండాలి.జీవితంలో స్థిరపకుండానే ప్రేమ అవసరమా అని ఆలోచించాలి. 21 ఏండ్లు నిండిన తరువాతే జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి. చిన్న వయస్సులో ప్రేమలో పడుతున్న చాలా మంది యువతులు మోసపోయి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. తమతో స్నేహం చేసే యువకుల నిజాయితీని గమనిస్తుండాలి. స్నేహితుడిగా ఉంటూనే హద్దు మీరి ప్రవర్తిస్తే మొదట్లోనే తల్లిదండ్రులకు చెప్పి దూరంగా ఉంచడం మంచిది. ఇబ్బంది పెడితే పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదు చేయాలి.

చట్టంలో ఉన్నదేంటి..?

 • బాలికలపై జరిగే లైంగిక వేధింపుల కోసం ప్రత్యేకంగా ఈ చట్టం రూపొందించారు. ఈ చట్టం ప్రకారం బాలికలను ఏ రకంగా ఇబ్బందులకు గురిచేసినా, ప్రలోభపెట్టినా తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది.
 • 18 ఏండ్లలోపు బాలికలను మాటలతో వేధించి అభద్రతాభావాన్ని కలిగించినా కేసు నమోదు చేయనున్నారు.
 • ఆకతాయిలు ఎవరైనా బాలికలను శారీరకంగా, మానసికంగా వేధిస్తే ఈ చట్టం ద్వారా నెలన్నరకు తక్కువ కాకుండా రిమాండ్‌లో ఉంచే అవకాశం ఉంటుంది.
 • బాలికలను ప్రేమ పేరుతో తమతో తీసుకెళ్లడం, పెండ్లి చేసుకోవడం కూడా నేరం. వారి ఇష్ట ప్రకారం వివాహం చేసుకున్నా చట్ట ప్రకారం నేరం చేసినట్లే.
 • ఫిర్యాదు నమోదైన ఏడాదిలోగా కేసు పూర్తి చేయాలనే నిబంధన ఉండడంతో సత్వర విచారణతోపాటు పరిశోధన వివరాలు న్యాయస్థానం ఎదుట పెట్టే అవకాశం ఉన్నది.
 • ఇలాంటి నేరాలకు చట్ట ప్రకారం నేరస్థాయిని బట్టి ఆరు నెలల నుంచి ఏడేండ్ల జైలు శిక్ష లేదా జీవితఖైదు విధించనున్నారు.

తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి..

 • చాలా మంది తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై దృష్టి సారించడం లేదు. రోజులో కనీసం రెండు గంటలైనా వారికి సమయం కేటాయించి మాట్లాడాలి.
 • అమ్మాయిలు ప్రేమిస్తున్నారన్న వెంటనే కొట్టడం, కళాశాలలు, పాఠశాలలు
 • బంద్‌ చేయించడం వంటివి చేయొద్దు.
 • ఇలా చేస్తే పిల్లలు విపరీతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.
 • పిల్లలకు ఒక వయస్సు వచ్చినప్పటి నుంచి చదువు, జ్ఞానం, ఉత్తమ జీవితం, ఉద్యోగం జీవితానికి ఎంత అవసరమో తెలియజెప్పాలి. ఆకర్షణకు, ప్రేమకు మధ్య తేడాను వివరించాలి.
 • కళాశాలలు, పాఠశాలల ఉపాధ్యాయులతో తరుచూ మాట్లాడి పిల్లల కదలికలు తెలుసుకోవాలి. వారితో స్నేహం చేసే వారి వివరాలపై కూడా ఆరాతీయాలి.
 • సామాజిక మాధ్యమాల్లో గడపడం వల్ల చిన్నవయస్సులోనే ఆకర్షణలో పడుతుంటారు. దీనిపై కచ్చితమైన నియంత్రణ ఉండాలి.

బాలికలకు వివరిస్తున్నాం..

 • 18 ఏండ్లలోపు బాలికలకు చట్టాలపై పోలీసు కళాజాతా బృందాలతో అవగాహన
 • కల్పిస్తున్నాం. తెలిసీ తెలియని వయస్సులో ప్రేమ పేరుతో మోసపోతున్నారు.
 • మరికొందరు తల్లిదండ్రులను ఎదిరించి బాలికను పెండ్లి చేసుకోవడం చట్ట
 • ప్రకారం నేరం. ఈ విషయం గురించి చాలా మందికి తెలియదు. చట్టాలపై
 • విస్తృతంగా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
 • షీ టీంలు మరింత సమర్థవంతంగా పనిచేసేలా చూస్తున్నాం.
 • ఆర్‌.వెంకటేశ్వర్లు, ఎస్పీ, మహబూబ్‌నగర్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement