e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Advertisement
Home జిల్లాలు నిరుపేదలకు వరం.. కల్యాణలక్ష్మి

నిరుపేదలకు వరం.. కల్యాణలక్ష్మి

నిరుపేదలకు వరం.. కల్యాణలక్ష్మి

పెద్దకొత్తపల్లి, ఏప్రిల్‌ 11: కల్యాణలక్ష్మి పథకం నిరుపేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ ఆవరణలో ఆదివారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 164 మంది కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.కోటీ 64 లక్షలు మంజూరు చేసిందన్నారు. ఈ మేరకు లబ్ధిదారులకు ఎమ్మెల్యే, ఎంపీపీ ప్రతాప్‌గౌడ్‌, జెడ్పీటీసీ గౌరమ్మతో కలిసి చెక్కులను అందజేశారు.
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు
రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి అంటురోగాలకు గురికాకుండా స్వచ్ఛమైన నీటిని తాగి ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకాన్ని అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధ్దన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బావాయిపల్లిలో మిషన్‌ భగీరథ పథకం కింద ఇంటింటికీ నల్లా నీటితోపాటు బీసీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ లైట్లను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ బావాయిపల్లి వాగుపై వంతెన పనులు త్వరలో మొదలు పెట్టిస్తానన్నారు. బావాయిపల్లి, రాజాపూర్‌, జనుంపల్లి గ్రామాల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఖానాపూర్‌ గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. సీసీరోడ్లు, వీధిలైట్ల ఏర్పాటు, వాగుపై వంతెన నిర్మాణం వంటి పనులను చేపట్టాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఖానాపూర్‌ వాగు వద్దకు వెళ్లి వంతెన నిర్మాణం ప్రదేశాన్ని పరిశీలించారు. అలాగే గంట్రావుపల్లి నుంచి ఖానాపూర్‌ మీదుగా కోడేరు వరకు రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించాలని పంచాయతీరాజ్‌ శాఖ ఎస్‌ఈతో ఫోన్‌లో మాట్లాడారు. ఆయా కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, తాసిల్దార్‌ శ్రీనివాసాచారి, సర్పంచులు వెంకటేశ్వర్‌రెడ్డి, సత్యం, శ్రీనివాస్‌రెడ్డి, చిన్నయ్య, పద్మమ్మ, సింగిల్‌విండో చైర్మన్లు రాజగౌడ్‌, శ్రీనివాసులు, ఎంపీటీసీ రేణుక, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు చంద్రయ్య తదితరులు ఉన్నారు.

Advertisement
నిరుపేదలకు వరం.. కల్యాణలక్ష్మి

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement