e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home జిల్లాలు ఫెర్రర్‌ సేవాస్ఫూర్తి ఆదర్శనీయం

ఫెర్రర్‌ సేవాస్ఫూర్తి ఆదర్శనీయం

ఫెర్రర్‌ సేవాస్ఫూర్తి ఆదర్శనీయం

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
అనాథ పిల్లల కోసం గ్రామస్తుల విరాళం

అచ్చంపేట/అచ్చంపేట రూరల్‌, ఏప్రిల్‌ 9: ఆర్డీటీ సంస్థ వ్యవస్థాపకుడు ఫాదర్‌ఫెర్రర్‌ సేవాస్ఫూర్తి మారుమూల గ్రామాల పేద ప్రజలతో మొదలైన సామాజిక సేవలు ఎందరికో ప్రేరణగా మారిందని ఆయన సేవలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఇతరులకు సాయం చేయడం బాధ్యతగా తీసుకోవాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఫాదర్‌ఫెర్రర్‌ జయంతిని పురస్కరించుకొని అచ్చంపేట మండలం ఐనోలు గ్రామం ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం ఆర్టీడీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. సంస్థ స్థాపించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామస్తులచే సమావేశం నిర్వహించి ఫాదర్‌ఫెర్రర్‌ సంస్థను స్థాపించి దేశంలో అందిస్తున్న సేవల గురించి వివరించారు. చిత్రపటానికి పూలమాలలు వేశారు. ముఖ్యఅతిథులుగా ప్రభుత్వవిప్‌ గువ్వల బాలరాజు హాజరై మాట్లాడారు. ఫాదర్‌ఫెర్రర్‌ ఒక్కడి ఆలోచనల వల్ల ఈనాడు దేశవ్యాప్తంగా ఆర్డీటీ సేవలు అందుతున్నాయన్నారు. ఇలాంటి సంస్థలు సమాజానికి మరిన్ని అవసరమన్నారు. సామాజిక కోణంలో ఆర్డీటీ సంస్థ అందిస్తున్న సేవలు, కల్పిస్తున్న వసతులు పేదలు అదృష్టంగా భావించాలన్నారు. అనంతరం జీబీఆర్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ గువ్వల అమల మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ పేదలకు ఏవిధంగా సేవలు చేస్తుందో అదే మాదిరిగా ఈ ప్రాంతంలో రానున్న రోజుల్లో జీబీఆర్‌ ట్రస్టు కూడా అందించేందుకు సిద్ధమవుతుందన్నారు. అనంతరం పిల్లలతో కలిసి కేక్‌కట్‌ చేశారు. ఆర్డీటీ సంస్థకు గ్రామస్తులు రూ.లక్ష విరాళం అందించారు. విరాళాన్ని పేద పిల్లల కోసం పంపిస్తామని సంస్థ కోఆర్డినేటర్‌ సరస్వతి తెలిపారు. సమావేశంలో మార్కెట్‌ చైర్మన్‌ సీఎంరెడ్డి, వైస్‌ చైర్మన్‌ గోపాల్‌నాయక్‌, సర్పంచ్‌ లోక్యానాయక్‌, పీఏసీసీఎస్‌ డైరెక్టర్‌ హన్మంతు, కౌన్సిలర్‌ శైలజ, గ్రామస్తులు పాల్గొన్నారు.

7వ వార్డులో బస్తీబాట
ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు శుక్రవారం బస్తీబాటలో భాగంగా 7వ వార్డు మహేంద్రనగర్‌, చౌటపల్లి రోడ్డులో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి సమస్యలపై ఆరా తీశారు. ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీలు, సీసీరోడ్లు, మిషన్‌ భగీరథ పనులు పరిశీలించారు. వార్డు ప్రజలను వేదిస్తున్న ఇండ్లపై వేలాడుతున్న విద్యుత్‌ వైర్ల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కరించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్‌, తులసీరాం, నర్సింహగౌడ్‌, మహముదాబేగం, బాలరాజు, రమేశ్‌రావు, ఖలీల్‌, నిజాముద్దీన్‌, పర్వతాలు, విష్ణు, రహమత్‌ తదితరులు పాల్గొన్నారు.


కల్యాణలక్ష్మితో మనోధైర్యం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో పేద కుటుంబాలకు మనోధైర్యం లభిస్తున్నదని ప్రభుత్వ విప్‌, గువ్వల బాలరాజు పేర్కొన్నారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 32 మంది లబ్ధిదారులకు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఆడ పిల్లల పెండ్లిళ్లు సంతోషంగా చేయాలని ఇంటి పెద్దన్న వలె సీఎం కేసీఆర్‌ దూరదృస్టితో ఆలోచించి పథకాలను అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. ఆడపిల్లలు కలిగిన కుటుంబాలు మనోధైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు.


అన్నివర్గాల అభివృద్ధే ధ్యేయం
మున్సిపాలిటీలోని అన్నివర్గాల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయమని విప్‌ గువ్వల బాలరాజు అన్నారు. శుక్రవారం పట్టణంలోని చౌటపల్లి రోడ్డు సమీపంలో బెడ బుక్కల, మేదరి కుల సంఘాల కమ్యూనిటీ భవన నిర్మాణాలకు ఆయన భూమిపూజ చేశారు. కమ్యూనిటీ భవనాలకు రూ.5 లక్షల చొప్పున మంజూరైనట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం ముందుకెళ్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నదని కొనియాడారు. సమావేశంలో తాసిల్దార్‌ చంద్రశేఖర్‌, సీఎంరెడ్డి, తులసిరాం, మంత్రియానాయక్‌, నర్సింహాగౌడ్‌, లోక్యనాయక్‌ పాల్గొన్నారు.

Advertisement
ఫెర్రర్‌ సేవాస్ఫూర్తి ఆదర్శనీయం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement