e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home జిల్లాలు పేదల సంక్షేమానికి సర్కార్‌ పెద్దపీట

పేదల సంక్షేమానికి సర్కార్‌ పెద్దపీట

పేదల సంక్షేమానికి సర్కార్‌ పెద్దపీట

ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి
54 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

కొల్లాపూర్‌, ఏప్రిల్‌ 2 : పేద ల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తె లిపారు. శుక్రవారం స్థా నిక ఎంజీకేఎల్‌ఐ గెస్ట్‌హౌస్‌లో 54 మంది లబ్ధిదారుల కు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. అలాగే 40% సబ్సిడీపై గంగాభవాని మత్స్య మిత్ర సంఘం అధ్యక్షురాలు భాగ్యలక్ష్మికి మంజూరైన చేపల విక్రయ సంచార వాహనా న్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ పేదలను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే అనేక పథకాలు అమలు చేస్తున్న ట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాలకూ న్యాయం చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టామన్నారు. చేపల ను, వంటకాలను నేరుగా వినియోగదారుడి వ ద్దకు చేర్చడంతోపాటు, వాటి విక్రయం ద్వారా మహిళలు లబ్ధి పొందేలా చేయడమే మొబైల్‌ ఫి ష్‌ ఔట్‌లెట్స్‌ పథకం ఉద్దేశమన్నారు. కా ర్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు జగదీశ్వర్‌రా వు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ మహిమూదాబేగం, మాచినేనిపల్లి సింగిల్‌విండో చైర్మన్‌ శ్రీనివాసులు, డైరెక్టర్‌ లక్ష్మణ్‌రావు, మాజీ ఉపసర్పంచ్‌ చంద్రశేఖరాచారి, కౌన్సిలర్‌ రాముడుయాదవ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌, రెవె న్యూ సీనియర్‌ అసిస్టెంట్‌ నజీరొద్దీన్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ ఉపాధ్యక్షుడు కరీమొద్దీన్‌, మత్స్య సహకార సంఘం తాలూకా అధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పేదల సంక్షేమానికి సర్కార్‌ పెద్దపీట

ట్రెండింగ్‌

Advertisement