ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
ఉచిత పోలీస్ శిక్షణ స్టడీ మెటీరియల్ పంపిణీ
హాజరైన ఎమ్మెల్యే ఆల, వనపర్తి కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా
కొత్తకోట, ఏప్రిల్ 2 : తెలంగాణలోని యువతీయువకులు నిరుద్యోగులుగా ఉండకుండా ఏదైనా ఉ ద్యోగం చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. ఆల రఘుపతిరెడ్డి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ శిక్షణకు సం బంధించిన స్టడీ మెటీరియల్‌ను శుక్రవారం పట్టణంలోని బీపీఆర్ గార్డెన్లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రె డ్డి, కలెక్టర్ షేక్‌యాస్మిన్ బాషాలతో కలిసి ఎర్రోళ్ల పం పిణీ చేశారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మా ట్లాడుతూ తెలంగాణలో ఎంతో మంది యువతీయువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని, త్వరలోనే మెగా డీఎస్సీతో భారీ ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు పేరు, ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. ఎమ్మె ల్యే ఆల ఇస్తున్న శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉం దన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి శిక్షణ కా ర్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అనంత రం ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ మనం నిజాయితీ తో బతుకుతూ మరొకరికి ఆదర్శంగా నిలవాలన్నా రు.
నిరుద్యోగులుగా ఎవరూ ఉండొద్దనే ఉద్దేశంతో పోలీస్ శిక్షణ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటికే మూడుసార్లు శిక్షణ ఇచ్చామని, దేవరకద్రలో 750 మందికి శిక్షణ ఇవ్వగా 180 మం ది ఉద్యోగాలు సాధించారని గుర్తు చేశారు. కలెక్టర్ షే క్యాస్మిన్ బాషా మాట్లాడుతూ ఎంచుకున్న ల క్ష్యాన్ని ఎంత కష్టమైనా చేరుకోవాలన్నారు. నాల్గో త రగతి ఉద్యోగం కూడా రాకపోయినా.. నిరుత్సాహం చెందకుండా మొక్కవోని పట్టుదలతో ఎంపీడీవో ఉ ద్యోగం సాధించానన్నారు. సమయాన్ని వృథా చేయకుండా కలెక్టర్ కొలువు కొట్టానని చెప్పారు. అంతకుముందు ఆల రఘుపతిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జెడ్పీవైస్ చై ర్మన్ వామన్‌గౌడ్, ఎంపీపీ మౌనిక, ఉమ్మడి జిల్లా అ ధికార ప్రతినిధి ప్రశాంత్, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని, మార్కెట్ కమిటీ చైర్మ న్ బాలనారాయణ, మాజీ జడ్పీటీసీ విశ్వేశ్వర్, కోఆప్షన్ సభ్యులు వసీంఖాన్, మిషేక్, వహిద్, డీఎస్పీ కి రణ్‌కుమార్, కౌన్సిలర్లు, నాయకులు కొండారెడ్డి, భీంరెడ్డి, గోవిందునాయుడు, వికాస్, హనుమంతుయాదవ్, మహేశ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.