జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంది
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
ఘనంగా సురవరం 125వ జయంతి ఉత్సవాలు
హన్మకొండ చౌరస్తా, మార్చి 28 : తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం సురవరం ప్రతాపరెడ్డి అని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సురవరం 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం హ న్మకొండ బాలసముద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మెఫీ(మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా), తెలంగాణ సారస్వత పరిషత్, సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య, వైజయంతి ట్రస్టు ఆధ్వర్యంలో ‘తెలుగు జర్నలిజం – పరిణామ క్రమం’పై సదస్సు నిర్వహించారు. సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తెలంగాణలో కవులే లేరనే నింద ను సవాలుగా తీసుకుని 354 మంది కవుల జీవిత విశేషాలతో ‘గోల్కొండ కవుల సంచిక’ గ్రంథాన్ని ప్రచురించి దీటైన సమాధానమిచ్చిన మహానుభావుడు సురవరం అన్నారు. 1926లో గోల్కొండ పత్రిక, దానికి అనుబంధంగా భారతి సాహిత్య పత్రిక, 1951లో ప్రజావాణి పత్రికలను స్థాపించాడని, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగులు, హైందవ ధర్మవీరులు, గ్రంథాలయ ఉద్యమం తదితర గ్రంథాలను రచించారన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిందన్నా రు. నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలను చైతన్యం చేశాడని, తెలుగు భాష, సంస్కృతి వికాసానికి ఎనలేని కృషి చేశాడన్నారు. జీవిత చరమాంకంలో రాజకీయాల్లో కూడా ప్రవేశించాడని, వనపర్తి నియోజకవర్గం నుంచి ఆనాడు హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారని గుర్తుచేశారు. తెలుగుజాతికి ప్రతాపరెడ్డి చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ఆయన విగ్రహాన్ని పెట్టారన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సురవ రం ప్రతాపరెడ్డి కుమారుడు కృష్ణవర్ధన్రెడ్డిని మం త్రి సన్మానించారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఏపీ ప్రభుత్వ మీడి యా సలహాదారు దేవులపల్లి అమర్, ఐజేయూ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు నగునూరి శేఖర్, కార్యదర్శి విరాహత్ అలీ, కవి, రచయిత కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్ పా త్రికేయులు టంకశాల అశోక్, వేణుగోపాలస్వా మి, ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మ శ్రీధర్‌రెడ్డి, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
రియల్మీ 8 సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్
అద్భుత ఫీచర్లతో రెడ్మీ స్మార్ట్ టీవీలు..ధరలు ఇవే!