e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 20, 2021
Home జిల్లాలు దళిత బంధుకు అడుగులు!

దళిత బంధుకు అడుగులు!

  • చారకొండలో ఇంటింటి సర్వే షురూ
  • ఆర్థిక స్థితిగతులపై అంచనా
  • కలెక్టర్‌ ఆధ్వర్యంలో చర్యలు
  • త్వరలో దళితబంధు కమిటీలు
  • మండలంలో 17 పంచాయతీలు
  • 2 వేల వరకు దళిత కుటుంబాలు

చారకొండ దళితులకు అండగా సర్కారు నిలువబోతున్నది. దళితబంధు అమలుకు అడుగులు పడుతున్నాయి. ఇంటింటికీ రూ.10 లక్షలు అందించే బృహత్తర పథకం అమలుకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో చర్యలు మొదలయ్యాయి. ఇంటింటి సర్వే మొదలవగా.. ఆర్థిక స్థితిగతులపై మండల రెవెన్యూ, పంచాయతీ అధికారులు ముందస్తుగా వివరాలు సేకరిస్తున్నారు. దళిత కుటుంబాల్లో ఉద్యోగులు,
వారికి ఉన్న భూమి, ఆర్థిక స్థితిగతులు, బ్యాంకు ఖాతాలు ఉన్న కుటుంబాలు, రేషన్‌ కార్డులు ఎందరికి ఉన్నాయి.. ఉపాధి అవకాశాల్లాంటి అంశాలను గుర్తిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు జారీ అయిన వెంటనే పథకం అమలుకు సమాయత్తమవుతున్నారు. త్వరలో ప్రతి పంచాయతీకి ఓ ప్రత్యేకాధికారిని నియ
మించడంతోపాటు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో దళితబంధు కమిటీలు వేయనున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా పైలట్‌ ప్రాజెక్టుగా చేపడుతున్న ఈ పథకం ద్వారా మండలంలోని 17 పంచాయతీల్లోని 2 వేల మంది దళిత కుటుంబాలు ఆర్థిక, సామాజికంగా ఎదగనున్నాయి.

నాగర్‌కర్నూల్‌, సెప్టెంబర్‌ 28 (నమస్తే తెలంగాణ) : సీ ఎం కేసీఆర్‌ దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం వేగవంతంగా అమలు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. కులవృత్తులను ఆదుకునేందుకు గొర్రెలు, చేప పిల్లల పంపిణీ, చేనేత పింఛన్‌, నాయీబ్రాహ్మ ణ, రజక వృత్తిదారులకు ఉచిత కరెంట్‌ వంటి పథకాలు అమ లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి వృత్తి పనులు లేని దళితులు సైతం ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా ఇంటింటికీ రూ.10 లక్షలు అందించే బృహత్తర పథకం ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని మారుమూల చారకొండ మండలాన్ని ఎంపిక చేయడం విశేషం. దీంతో క లెక్టర్‌ పి.ఉదయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రెవెన్యూ, పంచాయతీ అధికారులు దళితుల స్థితిగతులను తెలుసుకుంటున్నారు. మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 2011 జనాభా లెక్కల ప్రకారం 1200 కుటుంబాల్లో 4 వేల వరకు జనాభా ఉన్నది. అయితే, అధికారులు ఇటీవల సేకరించిన వివరాల ప్రకారం 2 వేల కుటుంబాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. త్వరలో పూర్తిస్థాయిలో గ్రామాల వారీగా మండల అధికారులు కుటుంబాల లెక్క గుర్తించనున్నారు. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆదేశాలు రాకున్నా స్థానిక యంత్రాం గం ముందస్తుగా వివరాలు సేకరిస్తున్నది. దళిత కుటుంబా ల్లో ఉద్యోగులు, దళిత కుటుంబాలకు ఉన్న భూమి, ఆర్థిక స్థితిగతులు, బ్యాంకు ఖాతాలు ఉన్న కుటుంబాలు, రేషన్‌ కా ర్డులు ఎంత మందికి ఉన్నాయి..? ఉపాధి అవకాశాలు వంటి అంశాలను గుర్తిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడిన వెంటనే పథకం అమలుకు సమాయాత్తమవుతున్నా రు. త్వరలో ప్రతి పంచాయతీకి ఓ ప్రత్యేకాధికారిని నియమించనున్నారు. ఈ అధికారుల ఆధ్వర్యంలో గ్రామాల్లోని దళితులకు సంబంధించిన వివరాలు పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఈ పథకం అమలు కోసం త్వర లో దళిత బంధు కమిటీలు వేసేందుకు సమాయాత్తం అవుతున్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో దళిత బం ధు కార్యవర్గాలు ఏర్పాటు కానున్నాయి. స్థానిక, కుల ధ్రువీకరణ వంటి పత్రాలను దళితులు సమకూర్చుకుంటున్నారు. మీ సేవా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వం అందించే రూ.10 లక్షలతో ఎలాంటి పనులు చేసుకోవాలో యోచిస్తున్నారు. దీని ద్వారా ఒకటికంటే ఎక్కువ వ్యాపారాలు పె ట్టుకునే అవకాశం ఉన్నది. ప్రభుత్వం ఈ పథకంలో భాగంగా గొర్రెలు, గేదెల పెంపకం, ట్రాక్టర్లు, ఆటోలు, పౌల్ట్రీ, సెంట్రింగ్‌ వంటి 30 రకాల వ్యాపారాల నిర్వహణకు అనుమతించనున్నది. దీంతో ఇందులో ఏయే పథకాలకు ఆయా ప్రాంతాల్లో అవకాశముంటుందో అంచనా వేసుకుంటున్నారు. కలెక్ట ర్‌ ఆధ్వర్యంలో ఈనెల 15న మండలంలో ని దళితులతో పెద్ద ఎత్తున అవగాహన సద స్సు ఏర్పాటు చేశారు. ఇందులో విప్‌ గు వ్వల బాలరాజు, ఎంపీ రాములు, ఎమ్మె ల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ పాల్గొని ప్రభుత్వ లక్ష్యాన్ని వివరిం చి, ఈ పథకంతో రాబోయే ఐదేండ్లలో రూ. కోటి సంపాదించే ఆర్థిక స్థితిమంతులు కావాలని ఆకాంక్షించారు. మొత్తమ్మీద దళిత బంధు పథకం అమలుకు ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు వేస్తున్న అడుగులతో చారకొం డ దళితుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

- Advertisement -

కుటుంబాల వివరాలు సేకరణ..

దళిత బంధు పథకానికి ఎంపిక కావడంతో చారకొండ మండలంలోని 17 గ్రామాల్లో దళిత కుటుంబాల వివరాలు సేకరిస్తున్నాం. ఇప్పటికే ఈ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించాం. సీఎం కేసీఆర్‌ నిజమైన దళిత పక్షపాతిగా నిరూపించుకున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు ప్రాథమికంగా వివరాలు సిద్ధంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి దళిత ఇంటికీ పథకం అందించడమే ప్రభుత్వ ఉద్దేశం. కలెక్టర్‌ ఆధ్వర్యంలో పథకం అమలుకు క్షేత్రస్థాయిలో కార్యాచరణ రూపొందిస్తున్నాం. త్వరలో దళిత బంధు కమిటీలు వేయనున్నాం.

  • నాగమణి, తాసిల్దార్‌, చారకొండ
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement