e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home జిల్లాలు పేరూర్‌ లిఫ్ట్‌తో ఆరు గ్రామాలు సస్యశ్యామలం

పేరూర్‌ లిఫ్ట్‌తో ఆరు గ్రామాలు సస్యశ్యామలం

పేరూర్‌ లిఫ్ట్‌తో  ఆరు గ్రామాలు సస్యశ్యామలం

దేవరకద్ర రూరల్‌, మార్చి 28 : దేవరకద్ర నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే దృఢ సంకల్పంతో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా పేరూర్‌ లిఫ్ట్‌ను కూడా సాధించాడు. పేరూర్‌ లిఫ్ట్‌ ద్వారా పేరూర్‌, రేకులంపల్లి, వెంకంపల్లి, వెంకటగిరి, అమ్మాపూర్‌, దాసర్‌పల్లి గ్రామాల ఆయకట్టుకు సాగు నీటికి లోటు ఉండదు. ఆ ప్రాంత రైతులు ఎంతో కాలంగా ఎదురు చూసిన పేరూర్‌ లిఫ్ట్‌కు ప్రభుత్వ ఆమోదం పొందడంతో త్వరలోనే కల నెరవేరుతున్నది.
51 కోట్ల నిధులు మంజూరు
పేరూర్‌ లిఫ్ట్‌ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం లభించింది, అందుకు గానూ రూ.51 కోట్ల నిధులు మంజూరు చేసింది.
3500 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు
పేరూర్‌ లిఫ్ట్‌ ద్వారా పేరూర్‌, వెంకంపల్లి, వెంకటగిరి, రేకులంపల్లి, అమ్మాపూర్‌, దాసర్‌పల్లి ఆరు గ్రామాల్లో 3,500 ఎకరాల ఆయకట్టు పొలం ఉంది. లిఫ్ట్‌ పూర్తయితే ఈ మొత్తం సాగులోకి వచ్చి ప్రాంతమంతా సస్యశ్యామలం కానున్నది.

గ్రామాలకు సాగునీటికి కరువుండదు
పేరూర్‌ లిఫ్ట్‌ ప్రా జెక్టు మంజూరుతో మా ప్రాంత రైతుల్లో ప్రభుత్వంపై పూర్తి భరోసా ఏర్పడింది. త్వరలో పనులు పూర్తయితే ఆరు గ్రామాల ఆయకట్టుకు సాగునీటికి కరువు ఉండదు. బీడు భూములు పచ్చని పంటలతో కళకళలాడుతాయి.

  • కృష్ణయ్య, మాజీ ఎంపీటీసీ, పేరూర్

ఇవి కూడా చదవండి

ఇది తింటే.. కేవ‌లం 4 గంట‌ల్లోనే షుగ‌ర్ త‌గ్గుతుంద‌ట‌..!

ఆవు పాల‌కి, బ‌ర్రె పాల‌కి మ‌ధ్య తేడా ఏంటి?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పేరూర్‌ లిఫ్ట్‌తో  ఆరు గ్రామాలు సస్యశ్యామలం

ట్రెండింగ్‌

Advertisement