మాదాపూర్ : మాదాపూర్‌లోని సెలబ్రిటీ సీక్రెట్స్లో ఆర్గానిక్ ఫేషియల్ ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. యువతులు తమ అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు ఆర్గానిక్ ఫేషియల్స్, ఆర్గానిక్ స్కిన్ వైటనింగ్, ఆర్గానిక్స్ ట్రీట్మెంట్, ఆర్గానిక్ స్కిన్ కేర్ రెజిమ్‌ను నిర్వాహకురాలు, డాక్టర్ మాదవి దరి అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ నేపథ్యంలో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నటీమణులు ఆశురెడ్డి, జెన్నీ, దీక్షా పంత్‌లు ప్రముఖ మోడల్ కృతికా హజరయ్యారు. ఇందులో భాగంగా యువతులు వివాహ వేడుక, పుట్టిన రోజు ఇతర వేడుకలకు అందంగా ముస్తాబు కావడానికి సెలబ్రిటీ సీక్రెట్స్లో అన్ని రకాల ఆర్గానిక్ నేచురల్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ప్రత్యేక చర్మ నిపుణులు, హెయిర్ కేర్ నిపుణులు సమస్యకు పరిష్కారం చూపనున్నట్లు ఆమె తెలిపారు.