e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 27, 2021
Home జిల్లాలు వరద హోరు

వరద హోరు

  • జూరాలకు 55 వేల క్యూసెక్కులు
  • ఐదు గేట్లు తెరిచి దిగువకు నీరు
  • రెండు యూనిట్లలో విద్యుదుత్పత్తి
  • తుంగభద్ర, శ్రీశైలం జలాశయాలకు పెరిగిన ఇన్‌ఫ్లో

ఆత్మకూరు, సెప్టెంబర్‌ 28 : ఎగువన కురుస్తు న్న వర్షాలకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వర ద స్థిరంగా కొనసాగుతున్నది. సోమవారం రాత్రి వరకు 5 గేట్లెత్తి నీటిని విడుదల చేయగా మంగళవారం తెల్లవారుజాము నుంచే గేట్లను మూసేశా రు. ఉదయం నుంచి 65 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగినప్పటికీ సాయంత్రం వరకు గేట్లన్నీ మూ సి ఉన్నాయి. సాయంత్రం 6 గంటల తర్వాత 55 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవగా 5 గేట్లెత్తి ది గువకు నీటిని విడుదల చేశారు. ఎడమ కాలువకు 975, కుడి కాలువకు 672, సమాంతర కాలువ కు 850, భీమా -2కు 750, నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తికి 35,922 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎగువ జూరాల జలవిద్యుత్‌ కేంద్రంలో 3.78 మి.యూ. ఉత్పత్తి జరుగగా ఇప్పటి వరకు 217.021 మిలియన్‌ యూనిట్లు జరిగింది. దిగువ జూరాల కేంద్రంలో 4.532 మి.యూ. ఉత్పత్తి జరుగగా మొత్తంగా 241.40 మిలియన్‌ యూనిట్లు చేశారు. డ్యాం పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా 8.571 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టు నుంచి మొత్తంగా 59,533 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగింది.

టీబీ డ్యాంకు స్వల్పంగా..

- Advertisement -

అయిజ, సెప్టెంబర్‌ 28 : తుంగభద్ర డ్యాంకు వరద స్వల్పంగా కొనసాగుతున్నది. మంగళవా రం ఇన్‌ఫ్లో 10,840, అవుట్‌ఫ్లో 10,593 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తి స్థాయి సామర్థ్యం 100.855 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 100.086 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఆర్డీఎస్‌ ఆనకట్టకు 7,952 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా.. 7,500 క్యూసెక్కులు సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నది. ప్రస్తుతం ఆనకట్టలో 8.9 అడుగుల నీటిమట్టం ఉండగా.. ప్రధాన కాల్వకు 452 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

‘సాగర్‌’ మూడు గేట్లు ఓపెన్‌..

దేవరకద్ర రూరల్‌, సెప్టెంబర్‌ 28 : పాలమూ రు జిల్లాలో వారం రోజులుగా అడపా దడపా వ ర్షాలు కురుస్తున్నాయి. దీంతో మండలంలోని కో యిల్‌సాగర్‌ ప్రాజెక్టుకు 2 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. మూడు గేట్ల నుంచి 2500 క్యూసెక్కు లు విడుదల చేస్తున్నట్లు ఈఈ ప్రతాప్‌సింగ్‌ తెలిపారు. పూర్తిస్థాయి సామర్థ్యం 32.6 అడుగులకు గానూ ప్రస్తుతం 32.5 అడుగులు ఉన్నది.

శ్రీశైలానికి స్వల్పంగా..

శ్రీశైలం, సెప్టెంబర్‌ 28 : కృష్ణానది పరీవాహక ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద ప్రవాహం పెరిగింది. మంగళవారం జూరాల ప్రాజెక్టు గేట్ల నుంచి 20,320, విద్యుదుత్పత్తి నుంచి 35,290, సుంకేసుల నుంచి 4,345.. మొత్తంగా 59,955 క్యూసెక్కుల నీరు విడుదలైంది. కాగా, రాత్రి వరకు రిజర్వాయర్‌కు 74,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఏపీ పవర్‌ హౌస్‌కు 31,110, టీఎస్‌ పవర్‌హౌస్‌కు 33,549 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తు తం 882.10 అడుగుల వద్ద నిల్వ ఉన్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement