e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home జిల్లాలు కల్యాణం.. కమనీయం

కల్యాణం.. కమనీయం

కల్యాణం.. కమనీయం

మన్యంకొండ, వట్టెం క్షేత్రాల్లో వైభవంగా కల్యాణోత్సవం
వేలాదిగా తరలొచ్చిన భక్తులు
మార్మోగిన గోవింద నామస్మరణ
మన్యంకొండ ఉత్సవంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్

మహబూబ్‌నగర్‌ మెట్టుగడ్డ, మార్చి 28: మన్యంకొండలోని అలివేలుమంగ అమ్మవారి కల్యాణోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. కల్యాణ వేడుకకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాను మరింతగా ఆభివృద్ధి చేసేందుకు అలివేలుమంగ సమేత వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు అవసరమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆకాంక్షించారు. అంతకుముందు అమ్మవారి కల్యాణోత్సవం మేళతాళాల మధ్యన అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కల్యాణ వేడుకకు భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. మంత్రి వెంట గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, డీసీసీబీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, మల్లు నరసింహారెడ్డి, పీఏసీసీఎస్‌ అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు.

మార్మోగిన గోవిందనామస్మరణ
మండలంలోని వట్టెం వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం గోవిందనామస్మరణతో మార్మోగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ఉత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. మొదట స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు చేశారు. ఉత్సవ విగ్రహాల ఊరేగింపు అనంతరం కల్యాణోత్సవాన్ని అర్చకుల వేదమంత్రాల మధ్య నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా గ్రామంలోని శ్రీనారదగిరి లక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త సందడి రంగారెడ్డి, అనంత నర్సింహారెడ్డి, సచ్చిదానందరెడ్డి, అశోక్‌రెడ్డి, ఉప్పల కృష్ణయ్య, శ్రీనివాస్‌రెడ్డి, అర్చకులు శ్రీమన్నారాయణ, మురళి కృష్ణమాచార్యులు, ఆలయ కమి టీ సభ్యుల ప్రతాప్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, శ్రీను, చంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

బాతుపిల్ల‌కు సింహం సాయం.. వైర‌ల్ వీడియో

భారత్‌కు బ్యాడ్‌న్యూస్‌..చివరి రెండు వన్డేల నుంచి శ్రేయస్‌ ఔట్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కల్యాణం.. కమనీయం

ట్రెండింగ్‌

Advertisement