e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home జిల్లాలు ఊరూరా బతుకమ్మ సంబురం

ఊరూరా బతుకమ్మ సంబురం

  • పాల్గొన్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

మక్తల్‌ టౌన్‌, అక్టోబర్‌ 13: తెలంగాణలో ఊరూరా మహిళలు బతుకమ్మ పండగ నిర్వహించుకుంటున్నారని మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం మక్తల్‌ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు, మహిళా సం ఘాల సభ్యులు ఘనంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ప్రకృతి పండగ అని తెలిపారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మరుగున పడ్డాయని సీఎం కేసీఆర్‌ తెలంగాణ అభివృద్ధి, ఆచార సంప్రదాయాలను ఉద్యమంలో గుర్తుచేస్తూ తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా బతుకమ్మ పండగను జరుపుకొంటున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనతో మన పండుగలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వనజ, ఎంపీడీవో శ్రీధర్‌, మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, సర్పంచ్‌ దత్తు, కాచ్‌వార్‌ ఎంపీటీసీ బలరాం, ఎంపీవో పావని, ఏపీవో గౌరీశంకర్‌, ఎంపీటీసీలు, సర్పంచులు, మహిళా సంఘాల సభ్యులు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఊట్కూర్‌లో..

- Advertisement -

ఊట్కూర్‌, అక్టోబర్‌ 13: మండలంలోన వివిధ గ్రామాల్లో బతుకమ్మ సంబురాలను మహిళలు బుధవారం ఘనంగా నిర్వహించారు. బిజ్వారం గ్రామ సర్పంచ్‌ సావిత్రమ్మ ఆధ్వర్యంలో ప్రధాన కూడలిలో బతుకమ్మను ఉంచి ఆడి పాడారు. తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా బతుకమ్మ సంబురాలు జరుపుకోవడం ఆనందదాయకమని సర్పంచ్‌ పేర్కొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ హన్మమ్మ, అంగన్‌వాడీ టీచర్లు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కృష్ణ మండలంలో..
కృష్ణ, అక్టోబర్‌ 13 : మండలంలోని ఆలంపల్లి, తంగిడ్గి, కున్సీ తదితర గ్రామాల్లో బుధవారం అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ టీచర్లు, చిన్నారులు, కిశోరబాలికలు ఘనంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ద్వారా పూలను దేవతగా పూజించే సంస్కృతి తెలంగాణ ప్రజలకు మాత్రమే సాధ్యమని, అందుకే రాష్ట్ర మంతటా బతుక మ్మ పండుగను జరుపుకొంటారన్నారు. తీరొక్క పూలను అమర్చి పసుపు, కుంకుమలతో బతుకమ్మ మధ్యలో గౌరమ్మను ఉంచి ఆలపాటలతో, కోలాటాలతో ఆనందంగా ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు లక్ష్మి, చిన్నారులు, గ్రామప్రజలు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement