సమాన పనికి సమాన వేతనం కల్పించిన ఘనత ఆయనదే..
టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రాజేందర్
నేటి నుంచి నాగార్జున సాగర్ నుంచి టీఎన్జీవోస్ బస్సు యాత్ర
జనగామ చౌరస్తా, ఏప్రిల్ 6: ఉద్యోగుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల రాజేంద ర్ అన్నారు. మంగళవారం జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో జనగామ జిల్లా టీఎన్జీవోస్ కార్యవర్గ సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడు తూ ఉద్యోగుల సమాన పనికి సమాన వేతనం కల్పించిన ఘ నత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. 11వ పీఆర్సీలో 30 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం ఆయన ఉద్యోగులపై చూపుతున్న ఆద రాభిమానాలకు నిదర్శనమన్నారు. 9 లక్షల 17 వేల 479 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చిన ముఖ్యమంత్రికి టీఎన్జీవోస్ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. సీపీఎస్ ఉద్యో గుల కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయడం ఆ యన గొప్పతనమన్నారు. ఎప్పటికప్పుడు ఉద్యోగుల సమస్య ల్ని పరిష్కరిస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా బుధవారం నాగార్జున సాగర్ నుంచి టీఎన్జీవోస్ బస్సు యాత్ర ప్రారంభి స్తున్నట్లు రాజేందర్ పేర్కొన్నారు. ఈ యాత్ర తెలంగాణలోని 33 జిల్లాల్లో కొనసాగుతుందన్నారు. టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ మాట్లాడుతూ ఒక్క మార్చి నెలలోనే ఉద్యోగులందరికీ ప్రమోషన్లు ఇప్పించిన ఘనత సీఎం కేసీఆర్, టీఎన్జీవోస్ సంఘానికే దక్కుతుందన్నారు.
అనంతరం టీఎన్జీవోస్ జనగామ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా ఖాజా షరీఫ్, ప్రధాన కార్య దర్శిగా పెండెల శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షుడిగా ఇట్టబోయిన శ్రీనివాస్, కోశాధికారిగా తలారి మల్లేశ్, ఉపా ధ్యక్షులుగా ఎండీ అఫీజ్, సీహెచ్ రాంనర్సయ్యను ఎన్నికైన ట్లు ఎన్నికల అధికారి కిషన్‌రావు ప్రకటించారు. అనంతరం టీఎన్జీవోస్ రాష్ట్ర నాయకులను, నూతన కమిటీ సభ్యులను సన్మానించా రు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు తమ సమస్యల్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోయి పరిష్కరించే లా చూడాలని రాష్ట్ర అధ్యక్షుడికి వినతి పత్రం అందజేశారు. సమావేశంలో టీఎన్జీవోస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కోలా రాజేశ్ కుమార్‌గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్, కార్యదర్శి రామునాయక్, కత్తి రమేశ్, గజ్జెల రాంకిషన్, సోమన్న, ఆకుల రాజేందర్, పుల్లూరి వేణు, టీఎన్జీవో జనగా మ జిల్లా మాజీ అధ్యక్షుడు రెడ్డబోయిన రాజయ్య, ప్రధాన కార్యదర్శి కిషన్ రావు, బూర్గు శివ, జ్ఞానేశ్వర్‌సింగ్, స్వరూప తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
శత్రు క్షిపణులను దారి మళ్లించే చాఫ్