బడంగ్‌పేట:75వ స్వాతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకుని బడంగ్‌పేట సర్కిల్ పరిధిలో 75 మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. బీజేవైఎం రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ టేకుల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో75 మీటర్ల జాతీయ జెండాతో భారీ ఊరేగింపు నిర్వహించారు.
జిల్లెలగూడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సంకల్పయాత్రను ప్రారంభించారు. జిల్లెలగూడ నుంచి మీర్‌పేట, బాలాపూర్ రస్తా, లెనిన్ నగర్, బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలోమాజీ సైనికుడు శ్రీనివాస్, యాదగిరి,తో పాటు వివిధ పార్టీల నాయకులు అందెల శ్రీరాములు, జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహరెడ్డి, దొడ్డిమల్లికార్జున్, పెద్ద బావి నాగనందీశ్వర్ రెడ్డి, కార్పొరేటర్స్, తదితరులు ఉన్నారు.