తెలుగుయూనివర్సిటీ: విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి ప్రోత్సహించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వ జవహార్ బాలభవన్ జానపదనృత్యం, భరతనాట్యం, స్కేటింగ్, యోగా, ఫిజికల్ యాక్టివిటీస్, సైన్స్ చిల్డ్రన్ లైబ్రరీ శిక్షణలో 5నుండి 16సంవత్సరాల వయస్సు పిల్లలనుంచి ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ జి. ఉషారాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సభ్యత్వ రుసుము మినహాయింపు ఉంటుందన్నారు.
ప్రభుత్వేతర పాఠశాల ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.20, ఇతరులు రూ.50ల చొప్పున సంవత్సర ఫీజు చెల్లించాలని సూచించారు. సభ్యత్వం పొందిన విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహిస్తామన్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు బహుమతులు అందించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. వివరాలకు 040-23233956నెంబర్లో సంప్రదించాలని సూచించారు.