కొండాపూర్ : సమాజ సేవ చేయడంలో జన్మ ఫౌండేషన్ తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. జన్మ ఫౌండేషన్ చేపట్టిన సామాజిక కార్యక్రమాలకు గాను ప్రైడ్ ఇండియా నేషనల్ 2021 అవార్డు వరించింది. వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆజాదీ కా అమ్రత్ మహోత్సవ్‌లో భాగంగా చలనచిత్ర నటుడు సుమన్, నిర్వాహకులతో కలిసి తెలంగాణ సారస్వత పరిషత్తు భవనంలో జన్మ ఫౌండేషన్ అధ్యక్షుడు రెడ్డిగారి భాస్కర్‌రెడ్డికి ఈ అవార్డును అందజేశారు.