బేగంపేట్: లాలాగూడ సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ లైన్లలో తలెత్తిన సాంకేతిక లోపాలు, ట్రిమ్మింగులు, ఫీడర్ల మరమ్మత్తుల కారణంగా శనివారం పైన తెలిపిన ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు చెన్నారెడ్డి ఫీడర్ పరిధిలో లంబాడిబస్తీ, కనకదుర్గ అపార్ట్ మెంట్స్, సండేమార్కెట్, విజయడైరీ, ఘరోండ అపార్ట్ మెంట్స్, డెవిడ్ మెమోరియల్ కాలేజ్ ప్రాంతాల్లో పై విధంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది.
మధ్యాహ్నాం 12 గంటల నుంచి 1 గంటల వరకు విజయపురి ఫీడర్ పరిధిలోని విజయపురి, చిల్డ్రన్స్ పార్క్, ఓయూ అపార్ట్ మెంట్స్, వాటర్ వర్క్ ప్రాంతాలలో పై విధంగా కరంటు ఉండదు. మధ్యాహ్నాం 1 గంట నుంచి 2 గంటల వరకు విజయడైరీ ప్రాంతంలో పై విధంగా విద్యుత్ ఉండదు. మధ్యాహ్నాం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తార్నాక ఫీడర్ పరిధిలోని డొమిక్ మోడల్ హైస్కూల్, పొచమ్మ టెంపుల్, సాయిసదన్ అపార్ట్ మెంట్స్ నారాయణ జూనియర్ కాలేజ్ ప్రాంతంలో పై విధంగా విద్యుత్ సరఫరా ఉండదు.