నేరడిగొండ, అక్టోబర్ 2 : బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా సంతోషంగా జరుపుకోవాలని నేరడిగొండ పీఏసీఎస్ చైర్మన్ సాబ్లే కిశోర్‌సింగ్ పేర్కొన్నారు. మండలంలోని లింగట్ల గ్రామంలో ఆదివారం మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. అలాగే మండలంలోని వాంకిడి, బొందిడి, బంధంరేగడి, చిన్నబుగ్గారం గ్రామాల్లో సర్పంచ్‌లు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు రాజు, స్వర్ణాంజలి, అనూష, అనిత, జాదవ్ సుభాష్, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, పవన్, విజయ, నాయకులు గులాబ్‌సింగ్, ఉత్తమ్‌సింగ్, జనార్దన్, వీవోఏ సంగీత, వార్డు సభ్యులు రాథోడ్ శంకర్, శ్యాంరావ్, పరమేశ్వర్ పాల్గొన్నారు.
ఉట్నూర్‌రూరల్, అక్టోబర్ 2 : ప్రతి ఒక్కరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఎంపీపీ పంద్ర జైవంత్‌రావ్ అన్నారు. మండలంలోని తాండ్ర, బాబాపూర్ గ్రామాల్లో బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు చిక్రం కోత్మబాయీవిశ్వనాథ్, దేవ్‌రావ్, టీఆర్ఎస్ మం డల కార్యదర్శి సీతారాం, ఉపసర్పంచ్ మనోహర్, నాయకులు ప్రహ్లాద్, సత్తన్న, భూమన్న, ఈశ్వర్ పాల్గొన్నారు.
నార్నూర్, అక్టోబర్ 2 : ఆడబిడ్డలకు పండుగ కానుకగా సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరెలు అందిస్తున్నారని ఎంపీపీ కనక మోతుబాయి అన్నారు. మండలంలోని బాబేఝరి గ్రామంలో బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. అనంతరం బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. మహిళలు గ్రామ సమీపంలోని చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మడావి కైలేశ్వరీసాగర్, కనక సేవంతాప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు.
బేల, అక్టోబర్ 2 : మండలంలోని పోహర్ గ్రామంలో సర్పంచ్ శంకర్ బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కొడప అరుణ్, అంగన్వాడీ టీచర్, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.
భీంపూర్, అక్టోబర్ 2 : వడ్గాం గ్రామంలో సర్పంచ్ మెస్రం చిన్ను బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు భీంరావ్, తదితరులు పాల్గొన్నారు.