ఉస్మానియా యూనివర్సిటీ : అతి తక్కువ సమయంలో అత్యధిక జాతీయ జెండాలను గుర్తు పట్టి బేబీ హన్సిక తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. తార్నాకలోని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో నగరానికి చెందిన గరుడపల్లి శివప్రసాద్, స్రవంతి దంపతుల కుమార్తె అయిన హన్సిక నాలుగేళ్ల వయసులోనే కేవలం 63 సెకన్లలో 100 దేశాల జాతీయ జెండాలను గుర్తించి రికార్డు సృష్టించింది.
ఈ మేరకు ఆ చిన్నారికి తెలుగు బుక్ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి రికార్డులకు సంబంధించిన జ్ఞాపికలను అందజేశారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో పాటు సూపర్ కిడ్స్ రికార్డ్స్‌లో కూడా హన్సిక పేరు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారి హన్సిక తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇంప్రూవ్ మెమోరీ ఇన్స్టిట్యూట్లో అందుకున్న శిక్షణతో తమ కూతురు ఈ ఘనత సాధించిందన్నారు.