e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home జిల్లాలు 39 ఎకరాలు 15కోట్లు

39 ఎకరాలు 15కోట్లు

39 ఎకరాలు 15కోట్లు

జూరాల ప్రాజెక్టు వద్ద పార్కు ఏర్పాటు
అత్యంత సుందరంగా రూపకల్పనకు చర్యలు
పార్కుకు టెండర్లు పూర్తి..త్వరలో భూమి పూజ

గద్వాల, ఏప్రిల్‌ 22: జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు పర్యాటక శోభ సంతరించుకుకోనున్నది. ప్రాజెక్టు కుడి కాలువ వద్ద 39.51 ఎకరాల్లో అన్ని వసతులతో రూ.15 కోట్లతో పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే పార్కు నిర్మాణానికి టెండర్లు పూర్తి కాగా త్వరలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారు.

జోగుళాంబ గద్వాల జిల్లా పర్యాటక శోభను సంతరించుకుంటున్నది. జూరాల ప్రాజెక్టు వద్ద పార్కు నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. రెండున్నర దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న జూరాల ప్రాజెక్టు వద్ద పార్కు నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. వానకాలంలో ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నప్పటికీ పర్యాటకులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. 2018 శాసనసభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ గద్వాలకు వచ్చిన సమయంలో పర్యాటకులకు ఆహ్లాదాన్నిచ్చేలా జూరాల ప్రాజెక్టు వద్ద పార్కు నిర్మాణం చేపడుతామని హామీ ఇచ్చారు. అప్పటి హామీ అమలుకు నోచుకున్నది. పార్కు పనులకు అనుమతులు రావడంతోపాటు రూ.15కోట్లు మంజూరు చేయడంతో ప్రస్తుతం టెండర్‌ ప్రక్రియ పూర్తయింది.

జూరాల కుడివైపున పార్కు నిర్మాణం
జూరాల కుడి కాల్వ వైపు జెన్‌కో సోలార్‌ విద్యుత్‌ కేంద్రం సమీపంలో పార్కుకు అనువైన స్థలం ఉండడంతో అక్కడ పార్కు నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడ సుమారు 39.51ఎకరాల ప్రభుత్వ భూమి ఉండడంతో అన్ని హంగులతో పార్కు నిర్మాణం చేపట్టనున్నారు. అన్ని వసతులతో సుమారు రూ.15కోట్లతో పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే పార్కు నిర్మాణానికి టెండర్లు పూర్తి కాగా త్వరలో మంత్రి చేతులమీదుగా ప్రారంభించడానికి స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు.

త్వరలోనే పనులు ప్రారంభిస్తాం
జూరాల ప్రాజెక్టు వద్ద పార్కు నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. త్వరలో పనులు ప్రారంభిస్తాం. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ సీఎం కేసీఆర్‌ సహకారంతో నా హయాంలో నెరవేరడం సంతోషంగా ఉంది. పార్కు నిర్మాణానికి గతంలోనే ఆర్థిక శాఖ ద్వారా అనుమతులు వచ్చాయి. ఈ పనులు పర్యాటక శాఖ పరిధిలో చేపట్టనున్నారు. జూరాల ప్రాజెక్టు ప్రారంభమై 30ఏండ్లు అవుతున్నా గత ప్రభుత్వాలు జీవోలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. పట్టణంతోపాటు సంగాల రిజర్వాయర్‌ వద్ద ప్రస్తుతం పార్కులు ఏర్పాటు చేశాం. పార్కు నిర్మాణం పూర్తయితే జూరాల పర్యాటక శోభను సంతరించుకోనున్నది.

  • బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల

ఇవి కూడా చదవండి

కొవిడ్‌ వేళ కేంద్రం వివక్ష

మోదీకి చిరంజీవి చురకలు.. నిర్ణయాన్ని మార్చుకోమని సలహా

కారుతో ఆదుకుంది!

Advertisement
39 ఎకరాలు 15కోట్లు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement