e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home జిల్లాలు బాధ్యతలు మరువక.. విరామం ఎరుగక..

బాధ్యతలు మరువక.. విరామం ఎరుగక..

బాధ్యతలు మరువక.. విరామం ఎరుగక..

మహిళా పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకం
కొవిడ్‌ ఉధృతిలోనూ నిర్విరామ సేవలు

దండేపల్లి, మే 30 : ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు విరామం లేకుండా పనిచేసే మహిళా ఉద్యోగులకు కరోనా అదనపు కష్టాలు తెచ్చిపెట్టింది. ఇంట్లో కుటుంబ బాధ్యతలు చూ సుకుంటూనే కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వారి సహనానికి హద్దులు లేవని చాటిచెబుతున్నారు. గ్రామాల్లో కరో నా కేసులు భయపెడుతున్నా.. ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. పల్లెల్లో పంచాయతీ కార్యదర్శులు అన్నీ ముందుండి చూసుకుంటున్నారు.
దండేపల్లి మండలంలో 31 గ్రామ పంచాయతీలున్నాయి. వీటి పరిధిలో ఏడుగురు మహిళా కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. మహమ్మారి ఇబ్బందులు పెడుతున్న తరుణంలో జీపీ కార్యదర్శులు కొవిడ్‌ బాధితుల దగ్గరకు వెళ్లి వివరాలు సేకరించ డం, గ్రామాల్లో శానిటైజేషన్‌ పనులు, ముమ్మరంగా జ్వర సర్వే నిర్వహించడం, ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ, నర్సరీల్లో మొ క్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు పాటించడం లాంటి పనుల్లో ముందుంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఏ కార్యక్రమమైనా మ హిళా కార్యదర్శులు బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు. దీంతో పాటు కొవిడ్‌ కట్టడిలో భాగస్వాములు అవుతున్నారు. ప్రభుత్వ పనుల కు ఆటంకం కలుగకుండా, కరోనా మరింత విస్తరించకుండా కృషి చేస్తున్నారు. కరోనా వేళ అందరూ ఇండ్లకే పరిమితమైతే వారు మాత్రం భయపడకుండా పల్లెబాట పడుతున్నారు.

సమష్టిగా గ్రామ సంక్షేమం..
గ్రామస్తులకు అవసరమైన సౌకర్యాలు సమకూర్చుతూనే ప్రభుత్వ పథకాల పర్యవేక్షిస్తున్నాం. గ్రామానికి సర్పంచ్‌ లేని లోటు ఎక్కడా రానీయకుండా ప్రజలు, ఉన్నతాధికారుల సహకారంతో ముందుకు వెళుతున్నా. నర్సరీ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నా. కొవిడ్‌ కట్టడికి గ్రామంలో వారానికి మూడుసార్లు హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయడం, బ్లీచింగ్‌ చల్లడం లాంటివి చేస్తున్నాం. నర్సరీలో మొక్కల పెరుగుదల, నీటి వసతి, వనమాలి పర్యవేక్షణ బాధ్యతలన్ని చూసుకుంటున్నా. గ్రామంలో పారిశుధ్య పనులు, గ్రామస్తులకు తాగునీరు అందడంలో అంతరాయం లేకుండా చూసుకుంటున్నాం. గతంలో కరోనా కేసులు ఎక్కువ ఉన్నా, ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి.

  • బెజ్జంకి ప్రియాంక, జీపీ కార్యదర్శి, నెల్కివెంకటాపూర్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బాధ్యతలు మరువక.. విరామం ఎరుగక..

ట్రెండింగ్‌

Advertisement