e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home కొమరంభీం రైతుసేవా కేంద్రాలతో మేలు

రైతుసేవా కేంద్రాలతో మేలు

రైతుసేవా కేంద్రాలతో మేలు

ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు
జైనూర్‌లో ఆగ్రోస్‌ రైతుసేవా కేంద్రం ప్రారంభం
అన్నదాతలకు విత్తనాలు అందజేత

జైనూర్‌, మే 30: ఆగ్రోస్‌ రైతుసేవా కేంద్రాలతో అన్నదాతలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. జైనూర్‌ మండల కేంద్రంలోని జీసీసీ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఆర్‌ఎస్‌కే కేంద్రాల ద్వారా ప్రభుత్వం రాయితీపై ఎరువులు అందిస్తున్నదన్నారు. మార్కెట్‌ రేట్‌ కంటే ఆగ్రోస్‌ కేంద్రాల్లో రాయితీపై ఎరువులు అందిస్తుండడంతో రైతులకు ఆర్థిక భారం తప్పుతుందన్నారు. అనంతరం ఏఆర్‌ఎస్కే నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. రైతు సేవా కేంద్రంతో పాటు సిర్పూర్‌ (యూ) రోడ్డుపై ఉన్న కొడప ఫర్టిలైజర్‌ షాపును కూడా ప్రారంభించారు.
కార్యక్రమంలో రాష్ట్ర హజ్‌ కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లాల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కనక యాదవ్‌రావ్‌, జిల్లా పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ అబుతాలిబ్‌, ఎంపీపీ కుమ్ర తిరుమల, జైనూర్‌, సిర్పూర్‌(యూ) వైస్‌ ఎంపీపీలు చీర్లె లక్ష్మణ్‌, ఆత్రం ప్రకాశ్‌, జైనూర్‌, సిర్పూర్‌ (యు), లింగాపూర్‌ మండలాల కోఆప్షన్‌ సభ్యులు ఫెరోజ్‌ఖాన్‌, సలీం, షాదుల్‌, సహకార సంఘం చైర్మన్‌ కోడప హన్నూపటేల్‌, రాష్ట్ర ఆదర్శరైతు కేంద్రె బాలాజీ, ఎంపీడీవో ప్రభుదయా, సీఐ హనోక్‌, మండల వ్యవసాయ శాఖ అధికారి పవన్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు మెస్రం అంబాజీ, ఎంపీటీసీలు లట్పటె మహదేవ్‌, జుగాదిరావ్‌, సర్పంచ్‌లు పార్వతీ లక్ష్మణ్‌, మడావి భీంరావ్‌, మాధవ్‌రావ్‌, శ్యాంరావ్‌, మాజీ వైస్‌ఎంపీపీ షేక్‌ రషీద్‌, నాయకులు అజ్జులాల, అహ్మద్‌ఖాన్‌, జాడి రవీందర్‌, డాక్టర్‌ ఉస్మాన్‌, సయ్యద్‌ జావిద్‌అలీ, షేక్‌అబ్బు, సయ్యద్‌ సజ్జాద్‌, షేక్‌ ఖలీల్‌, షేక్‌ అఖిల్‌, షేక్‌ ఫజల్‌, ముజాహిద్‌, మన్నాన్‌, నదీం, జునేద్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రైతుసేవా కేంద్రాలతో మేలు

ట్రెండింగ్‌

Advertisement