e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home జిల్లాలు అర్హులందరికీ ఆహారభద్రత

అర్హులందరికీ ఆహారభద్రత

జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం
అలంపూర్‌, జూలై 28 : అర్హత కలిగిన ప్రతి కుటుంబానికీ ఆహార భద్రత కార్డులు ప్రభుత్వం అందజేస్తున్నదని జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, అలంపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహం అన్నారు. అలంపూర్‌ మండలకేంద్రంలో తాసిల్దార్‌ మదన్‌మోహన్‌రావు అధ్యక్షతన రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా ముఖ్యఅతిథులుగా వారు హాజరై పంపిణీ చేశారు. మండలం మొత్తంలో 245 కొత్త రేషన్‌ కార్డులు మంజూరైనట్లు తాసిల్దార్‌ వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మనోరమ, వైస్‌ చైర్మన్‌ శేఖర్‌రెడ్డి, డీటీ రాంభూపాల్‌రెడ్డి, కౌన్సిలర్‌ సుదర్శన్‌గౌడ్‌, మార్కెట్‌ యార్డు వైస్‌చైర్మన్‌ లక్ష్మన్న, ఆలయ కమిటీ చైర్మన్‌ రవి ప్రకాశ్‌గౌడ్‌ పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఉండవెల్లి, జూలై 28 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని జెడ్పీచైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద బుధవారం రేషన్‌కార్డుల పం పిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీచైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యే అబ్రహం, అదనపు కలెక్టర్‌ రఘురాంశర్మ, ఎంపీపీ బీసమ్మ వివిధ గ్రామాలకు చెందిన 147 మందికి రేషన్‌ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాసిల్దార్‌ వీరభద్రప్ప, వైస్‌ఎంపీపీ దేవన్న, జెడ్పీటీసీలు రాములమ్మ, రాజు, సర్పంచ్‌ రేఖావెంకట్‌గౌడ్‌, ఎంపీటీసీలు సుంకన్న, రాజశేఖర్‌, సర్పంచులు పాల్గొన్నారు.
అర్హులందరికీ అందజేస్తాం
మానవపాడు , జూలై 28 : అర్హులందరికీ రేషన్‌ కార్డులు అందజేస్త్తామని జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. మండలకేంద్రంలోని తాసిల్దార్‌ కార్యాలయం వద్ద బుధవారం వారు లబ్ధిదారులకు రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని పథకాలు సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని, అలాంటి సీఎం ఉండడం మన అదృష్టమన్నారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత మాట్లాడుతూ మరిన్ని కార్డులు అందిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచులు , ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana