e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home జిల్లాలు పరిసరాల శుభ్రత పాటించకపోతే చర్యలు

పరిసరాల శుభ్రత పాటించకపోతే చర్యలు

పరిసరాల శుభ్రత పాటించకపోతే చర్యలు

బోథ్‌, మే 28: పంచాయతీల్లో పరిసరాల శుభ్రత పాటించకపోతే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ హెచ్చరించారు. మండలంలోని బోథ్‌, సొనాల గ్రామాలను శుక్రవారం ఆయన సందర్శించారు. డీఆర్డీవో ఎస్‌ కిషన్‌తో కలిసి నర్సరీలు, ఉపాధి హామీ పనులను పరిశీలించారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేసే వారికి జరిమానాలు విధించాలన్నారు. బోథ్‌లో ఓ పండ్ల వ్యాపారికి రూ. 2500, మాస్కులు ధరించని వారికి రూ.500 చొప్పున జరిమానా విధించారు. అనంతరం కరత్వాడ సమీపంలో చేపడుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో సీహెచ్‌ రాధ, ఎంపీవో జీవన్‌రెడ్డి, ఈవో సంజీవ్‌రావు, ఈజీఎస్‌ ఏపీవో భీంరావు, సర్పంచ్‌లు సురేందర్‌యాదవ్‌, సదానం దం, కార్యదర్శులు ఉన్నారు.
మొక్కల సంరక్షణపై నిర్లక్ష్యం వద్దు
ఇచ్చోడ, మే 28 : హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణపై నిర్లక్ష్యం చూపితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ హెచ్చరించారు. వాటర్‌ డేను పురస్కరించుకొని మండల కేంద్రంలో శుక్రవారం డీఆర్డీవోతో కలిసి మొక్కలకు నీరు పట్టారు. అనంతరం సాత్‌నంబర్‌ గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. గ్రామాల్లో నాటిన మొక్కలు 85 శాతం సంరక్షించే బాధ్యతను గ్రామస్తులు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఏడో విడుత హరితహారంలో ప్రతి పంచాయతీలో 10 వేల మొక్కలు నాటడమే లక్ష్యమని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వామనభట్ల రాంప్రసాద్‌, ఎంపీవో రమేశ్‌, ఈవో నర్సారెడి,్డ కార్యదర్శి ఫాతిమా బీ, సిబ్బంది పాల్గొన్నారు.
‘ఉపా’ని సద్వినియోగం చేసుకోవాలి
బజార్‌హత్నూర్‌, మే 28 : ఉపాధిహామీ పనులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. మండలకేంద్రంలోని చెరువు ప్రాంతంలో చేపడుతున్న ఫిష్‌పాండ్‌ పనులను డీఆర్డీవో కిషన్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. చెరువుల్లోని సారవవంతమైన మట్టిని రైతులు తమ పొలాలకు తరలించుకోవాలని సూచించారు. పనికి తగిన వేతనం అందుతుందా అని కూలీలను అడిగి తెలుసుకున్నారు. ఐదు వారాలుగా తాము చేసిన పనులకు ఇప్పటికీ డబ్బులు రాలేదని కూలీలు తెలిపారు. త్వరలోనే డబ్బులు వచ్చేలా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో దుర్గం శంకర్‌, పీఆర్‌ఏఈ నారాయణ, ఏపీవో శ్రీనివాస్‌, ఎంపీవో మహేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సాయిప్రసాద్‌, ఈజీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పరిసరాల శుభ్రత పాటించకపోతే చర్యలు

ట్రెండింగ్‌

Advertisement