e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home జిల్లాలు ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్‌

ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్‌

ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్‌

రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే లక్ష్యంతో పనిచేస్తోంది
వ్యాక్సిన్‌ ప్రక్రియ పరిశీలనలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర

సత్తుపల్లి, మే 28: రాష్ట్రంలో కరోనాను పారదోలేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిఒక్కరికీ వ్యాక్సినేషన్‌ అందించే లక్ష్యంతో పనిచేస్తోందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. స్థానిక బాలికోన్నత పాఠశాలలో సూపర్‌ స్పైడర్లకు ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కరోనాను కట్టడి చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించిందన్నారు. రెండు డోసులుగా ఈ టీకాలను విభజించి అందిస్తోందన్నారు. ఇప్పటికే రెండు డోసులు తీసుకున్న వారు నిర్భయంగా ఉన్నారన్నారు. ప్రజలతో నిత్యం అనుసంధానంగా ఉండే సూపర్‌ స్పైడర్లకు ఇప్పుడు వ్యాక్సినేషన్‌ అందిస్తోందన్నారు. తహసీల్దార్‌ మీనన్‌, ఎంపీడీవో చిట్యాల సుభాషిణి, మున్సిపల్‌ కమిషనర్‌ సుజాత, ఏడీ నర్సింహారావు, ఏవో శ్రీనివాసరావు, డీటీ సంపత్‌కుమార్‌, ఆర్‌ఐలు జగదీశ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేశ్‌, ఆత్మ చైర్మన్‌ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ చల్లగుళ్ల కృష్ణయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్‌

ట్రెండింగ్‌

Advertisement