e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home జిల్లాలు కేంద్రాలతో రైతులకు మేలు

కేంద్రాలతో రైతులకు మేలు

కేంద్రాలతో రైతులకు మేలు

ధర్మారం, ఏప్రిల్‌ 28: రైతాంగానికి మేలు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ తెలిపారు. మండలంలో బుధవారం ఆమె పర్యటించి నందిమేడారం సింగిల్‌ విండో ఆధ్వర్యంలో గోపాల్‌రావుపేట, సాయంపేట, నంది మేడారం, చామనపల్లి, పైడిచింతలపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ధర్మారం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్మన్‌ గుర్రం మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమాల్లో సర్పంచులు పూస్కూరు జితేందర్‌రావు, జనగామ అంజయ్య, చెనెల్లి సాయి కుమార్‌, సామంతుల జానకి, దాసరి స్వామి, బద్దం వెంకటమ్మ, మార్కెట్‌ కార్యదర్శి సరోజన, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మిట్ట తిరుపతి, ఆర్‌బీఎస్‌ బాధ్యులు పాకాల రాజయ్య, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ఎంపీటీసీలు తుమ్మల రాంబాబు, సూరమల్ల శ్రీనివాస్‌, జడ్పీ, మండల కో ఆప్షన్‌ సభ్యులు ఎండీ సలామొద్దీన్‌, ఎండీ రఫీ, విండో వైస్‌ చైర్మన్‌ సామంతుల రాజమల్లు, ఏఈవో రాంచంద్రం, విండో, ఏఎంసీ డైరెక్టర్లు భారత స్వామి, బొంగాని తిరుపతి, గుజ్జేటి కనకలక్ష్మి, బొడ్డు మల్లయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు కూరపాటి శ్రీనివాస్‌, సందినేని కొమురయ్య, సామంతుల శంకర్‌, కట్ట స్వామి, కట్ట రమేశ్‌, పాక వెంకటేశం, దేవి రమణ, గోరువంతుల సంజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.
రామగిరి, ఏప్రిల్‌ 28: ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని కమాన్‌పూర్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ ఇనుగంటి భాస్కర్‌రావు కోరారు. బుధవారం పన్నూర్‌లో పీఏసీఎస్‌ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్‌ అల్లం పద్మ చేతుల మీదుగా ప్రారంభించగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వర్షాల కారణంగా ధాన్యం తడిసినా కొనుగోలు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ఆర్‌బీఎస్‌ మండల కోఆర్డినేటర్‌ కుమార్‌, ఎంపీటీసీ చిందం మహేశ్‌, సింగిల్‌ విండో డైరెక్టర్‌ సైండ్ల సత్యనారాయణ, ఏఎంసీ డైరెక్టర్‌ ఆసం తిరుపతి, గ్రంథాలయ బోర్డ్‌ డైరెక్టర్‌ ఇజ్జగిరి రాజు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆరెల్లి కొమురయ్య గౌడ్‌, అల్లం తిరుపతి పాల్గొన్నారు.
మంథని రూరల్‌, ఏప్రిల్‌ 28: ఖాన్‌సాయిపేటలో డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్‌బీఎస్‌ మండల కోఆర్డినేటర్‌ ఆకుల కిరణ్‌ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్‌, జడ్పీటీసీ తగరం సుమలత, పీఏసీఎస్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌, ఏఎంసీ చైర్మన్‌ శ్రీరాంభట్ల సంతోషిణి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శంకర్‌లాల్‌, సర్పంచ్‌ లింగయ్య, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
జ్యోతినగర్‌(రామగుండం), ఏప్రిల్‌ 28: విలేజ్‌ రామగుండంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్‌ మామిడాల ప్రభాకర్‌, అంతర్గాం జడ్పీటీసీ ఆముల నారాయణ ప్రారంభించారు. ఇక్కడ రామగుండం ఏవో కే ప్రకాశ్‌, ఏరియా టెక్నాలజీ మేనేజర్‌ కే సాగర్‌, ఆర్‌బీఎస్‌ మండల కోఆర్డినేటర్‌ గౌస్‌ పాషా, సెంటర్‌ ఇన్‌చార్జి సురేశ్‌, ఆర్‌ఐ చంద్రమౌళి, వీఆర్వో శంకర్‌స్వామి తదితరులు ఉన్నారు.
అంతర్గాం, ఏప్రిల్‌ 28: లింగాపూర్‌లో మేడిపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీవో మైకెల్‌ బోస్‌ ప్రారంభించారు. తమ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం కావాలని కోరగానే ఎమ్మెల్యే చందర్‌ స్పందించి ఏర్పాటు చేయించినందుకు మాజీ సర్పంచ్‌ అర్శనపల్లి మల్లీశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మేడిపల్లి సింగిల్‌ విండో చైర్మన్‌ మామిడాల ప్రభాకర్‌, జడ్పీటీసీ ఆముల నారాయణ, వైస్‌ చైర్మన్‌ ధర్ని పోచం, తహసీల్దార్‌ బండి ప్రకాశ్‌, ఇరికిల్ల శంకర్‌, ఏఈవో హరీశ్‌, వీఆర్వో నిహారిక, వనిత ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కేంద్రాలతో రైతులకు మేలు

ట్రెండింగ్‌

Advertisement