e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home జిల్లాలు లక్ష్యం దిశగా ధాన్యం కొనుగోళ్లు

లక్ష్యం దిశగా ధాన్యం కొనుగోళ్లు

లక్ష్యం దిశగా ధాన్యం కొనుగోళ్లు

4.25 లక్షల మెట్రిక్‌ టన్నులు టార్గెట్‌
ఇప్పటి దాకా 20,051 మెట్రిక్‌ టన్నులు సేకరణ
రైతుల ఖాతాల్లో రూ. 1.20 కోట్ల డబ్బులు జమ

పెద్దపల్లి జంక్షన్‌, ఏప్రిల్‌ 28: ఈ యాసంగిలో జిల్లావ్యాప్తంగా 1.90 ఎకరాల్లో వరి సాగు కాగా, 4.66 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారుల అంచనా వేశారు. ఇందులో 4.25మెట్రిక్‌ టన్నుల ధాన్యా న్ని కొనుగోలు చేసే అవకాశముందని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని 116 రైస్‌మిల్లులకు సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. 1. 06 కో ట్ల గన్నీ సంచులు అవసరం కాగా, ప్రస్తుతం 80 లక్షలు అందుబాటులో ఉన్నాయి. 10 లక్షలు చొప్పున మిల్లర్లు, ఉత్పత్తిదారుల వద్ద ఉన్నాయి.
రవాణాలో జాప్యం లేకుండా..
జిల్లావ్యాప్తంగా 306 ధాన్యం కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేయాలని అధికారుల లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఏఎంసీ 5, ఐకేపీ 64, డీసీఎంఎస్‌ 16, పీఏసీఎస్‌ 221 కొనుగోలు కేం ద్రాలు ఉన్నాయి. జిల్లాలో ఈ నెల 13వ తేదీన ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్ప టి దాకా 270 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిం చి 2097 మంది రైతుల నుంచి 20,051 మె ట్రిక్‌ ధాన్యాన్ని కొనుగోలు చేశామని అధికారు లు వెల్లడించారు. ఇప్పటిదాకా రూ. 1. 20 కోట్ల డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశా రు. ధాన్యం రవాణాలో జాప్యం లేకుండా పెద్దపల్లి, మంథని, రామగుండం, సుల్తాన్‌బాద్‌ క్లస్టర్లుగా ఏర్పాటు చేసి దాదాపు 600 లారీల తోపా టు ట్రాక్టర్లతో ధాన్యాన్ని రైస్‌ మిల్లలుకు తరలించే ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. అలాగే గత యాసంగిలో 291 కొనుగోలు కేంద్రాలు ఏ ర్పాటు చేసి 3.68 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని అధికారులు గుర్తు చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లక్ష్యం దిశగా ధాన్యం కొనుగోళ్లు

ట్రెండింగ్‌

Advertisement