e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home జిల్లాలు ఇష్టారాజ్యంగా తిరుగవద్దు

ఇష్టారాజ్యంగా తిరుగవద్దు

ఇష్టారాజ్యంగా తిరుగవద్దు

వచ్చే నెలలో కొవిడ్‌ తగ్గే అవకాశం
డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌
ఇంటింటా సర్వే పరిశీలిన

ఎదులాపురం,మే 27 : కేసులు తగ్గుతున్నాయని ప్రజలు ఇష్టారాజ్యంగా తిరుగవద్దని ఆదిలాబాద్‌ డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటా సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే చేస్తున్న తీరును పర్యవేక్షించారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇంటింటా ఫీవర్‌ సర్వే చేపట్టడంతో పాటు లాక్‌డౌన్‌ విధించడంతో జిల్లాలో కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. అంతకు ముందు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో 15 శాతం పాజిటివ్‌ కేసులు వచ్చేవని ప్రస్తుతం 4.5 శాతమే వస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలందరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. వచ్చే నెల కొవిడ్‌ పూర్తిగా తగ్గే అవకాశం ఉందన్నారు. సర్వేలో శాంతినగర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ సట్ల కిరణ్‌ కు మార్‌, సీవో రాజారెడ్డి, ఏఎన్‌ఎం లక్ష్మి, ఆశ కార్యకర్తలు రుక్మి, పద్మ తదితరులు ఉన్నారు.
నార్నూర్‌,మే27: ఇంటింటా ఫీవర్‌ సర్వేను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏజెన్సీ జిల్లా అదనపు వైద్యాధికారి కుడ్మెత మనోహర్‌ అన్నారు. మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. సర్వే వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన ఫీవర్‌ సర్వేను పకడ్బందీగా అమలు చేసేలా కృషి చేస్తున్నామని తెలిపారు. నార్నూర్‌ మండ లంలో 53 బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించడంతో కొవిడ్‌ లక్షణాలు ఉన్న వారికి మెడికల్‌ కిట్‌ ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 14,071మందికి పరీక్షలు చేశామని వివరించారు. 252 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. కిట్లు అందించడంతో పాటు ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. దవాఖానకు వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు.
ఉట్నూర్‌ రూరల్‌, మే 27 : దంతన్‌పెల్లి పీహెచ్‌సీ పరిధిలోని గంగన్నపేట్‌, శాంతినగర్‌, హనుమాన్‌నగర్‌లో గురువారం జ్వర సర్వే నిర్వహించారు. వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు ప్రతి ఇంట్లోని కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. పరీక్షలు నిర్వహించి వివరాలు రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారికి మందులు అందించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఈ సత్యనారాయణ, సూపర్‌వైజర్‌ నూర్‌సింగ్‌, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇష్టారాజ్యంగా తిరుగవద్దు

ట్రెండింగ్‌

Advertisement