e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home జిల్లాలు విజయానికి చిహ్నం గులాబీ జెండా

విజయానికి చిహ్నం గులాబీ జెండా

విజయానికి చిహ్నం గులాబీ జెండా

జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి
నివాసం వద్ద టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం
ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరణ

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 27 : గులాబీ జెండా విజయానికి చిహ్నమని జడ్పీ చైర్స్‌ పర్సన్‌ కోవలక్ష్మి అన్నారు. జలదృశ్యంలో మొదలైన ప్రస్థానం మంగళవారం నాటికి 20 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని తన నివాసం వద్ద పార్టీ ఆవిర్భావ దినత్సోవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద, బడు గు, బలహీన వర్గాల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ పార్టీ కృషి చేస్తున్నదని కొనియాడారు. టీఆర్‌ఎస్‌ 20 ఏండ్ల ప్రయాణంలో ఎన్నో సాధించామని, ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గాదెవేణి మల్లేశ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ అలీబిన్‌హైమద్‌, మాజీ ఎంపీపీ బొమ్మెన బాలేశ్వర్‌గౌడ్‌, నాయకులు సాంగ్డె జీవన్‌, సలాం, రవీందర్‌, అబ్దుల్లా, శైలేందర్‌, కార్తిక్‌, గణేశ్‌, షబ్బీర్‌, మంగ ఉన్నారు.
కౌటాల, ఏప్రిల్‌ 27 : కుమ్రం భీం చౌరస్తాలో మండలాధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌ జెండాను ఆవిష్కరించారు. ఎంపీపీ బసార్కర్‌ విశ్వనాథ్‌, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ కుమ్రం మాంతయ్య, సర్పంచ్‌ వొజ్జల మౌనిశ్‌, ఉపసర్పంచ్‌ పసునూరి తిరుపతి, ఎంపీటీసీలు మనీశ్‌, వసంత్‌ రావు, నాయకులు నయీం, రవీందర్‌ గౌడ్‌, సంతోష్‌, శ్రీనివాస్‌, ప్రభాకర్‌ గౌడ్‌, ఆగయ్య, మధుకర్‌, రాంచందర్‌, నాయకులు ఉన్నారు.

కాగజ్‌నగర్‌టౌన్‌ , ఏప్రిల్‌ 27 : పట్టణంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి.. టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమైందన్నారు. కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


సిర్పూర్‌(టి), ఏప్రిల్‌ 27 : మండలకేంద్రంలోని బస్టాండ్‌ వద్ద టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బొమ్మన శ్రీనివాస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. మండల కో ఆప్షన్‌ సభ్యుడు కీజర్‌ హుస్సేన్‌, ఉప సర్పంచ్‌ తోట మహేశ్‌, నవేగాం మాజీ సర్పంచ్‌ నర్గేవార్‌ శంకర్‌, నాయకులు ఎండీ ఇఫ్ఫత్‌ హుస్సేన్‌, మల్కరీ ప్రసాద్‌, రాపర్తి శ్రీకాంత్‌, తక్కళ్ల తిరుపతి, మోయిజ్‌ పాల్గొన్నారు.
జైనూర్‌, ఏప్రిల్‌ 27: జైనూర్‌, సిర్పూర్‌(యు) మండల కేంద్రాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భగా నాయకులు గులాబీ జెండాను ఆవిష్కరించి జై తెలంగాణ నినాదాలు చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కనక యాదవ్‌రావ్‌, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు చీర్లె లక్ష్మణ్‌, సహకార సంఘం చైర్మన్‌ కొడప హన్నుపటేల్‌, ఎంపీటీసీ లట్పటె మహాదేవ్‌, సర్పంచ్‌ పార్వతీ లక్ష్మణ్‌, నాయకులు షేక్‌ ఫజల్‌, జన్నావార్‌ పవన్‌, గెడాం లక్ష్మణ్‌, పెందుర్‌ లక్ష్మణ్‌ తదితరులున్నారు.


ఆసిఫాబాద్‌(వాంకిడి), ఏప్రిల్‌27 : వాంకిడి మండల కేంద్రం లో ఎంపీపీ విమలాబాయి పార్టీ జెండాను ఆవిష్కరించారు. సర్పంచ్‌ తుకారం, నాయకులు అశోక్‌, రోషన్‌, కమలాకర్‌, దీపక్‌, రాకేశ్‌, సాయి, జయరాం పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
విజయానికి చిహ్నం గులాబీ జెండా

ట్రెండింగ్‌

Advertisement