e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home జిల్లాలు నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలి

నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలి

నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలి
  • కుమ్రం భీం ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌
  • అధికారులతో సమావేశం
  • ఆసిఫాబాద్‌,ఏప్రిల్‌ 27 : నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని కుమ్రం భీం ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధితశాఖల అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో దళారులు రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతారని, వారు మోసపోకుండా ఉండేందుకు గ్రా మాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నా రు. నకిలీ విత్తనాల వల్ల కాలుష్యం పెరుగడమేకాకుండా భూమిలోని సారం దెబ్బతింటుందన్నారు. గైఫోసెట్‌ మందు వాడకం వల్ల రైతులకు క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. వ్యవసాయ అధికారులు గ్రామాల వారీగా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే పోలీసులకు, వ్యవసాయాధికారులకు సమాచారం ఇ వ్వాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రా జేశం, జిల్లా వ్యవసాధికారి శ్రీనివాసరావు, ఏఎస్పీలు అచ్చేశ్వర్‌రావు, బాలస్వామి, మండల వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలి

ట్రెండింగ్‌

Advertisement