e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home జిల్లాలు నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

పెంబి, మే 26 : నకిలీ విత్తనాలు విక్ర యిస్తే చర్యలు తప్పవని ఇన్‌చార్జి ఏడీఏ ఆసం రవి పేర్కొనారు. బుధవారం మండ ల కేంద్రంలో ఆగ్రో రైతు సేవా కేంద్రంలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని, ప్రభుత్వం గుర్తించిన విత్తనాలనే కొనుగోలు చేయాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు కోను గోలు చేసిన తర్వాత రసీదులు తీసుకోవాల న్నారు. ఏఈవో గంగాజల, ఆర్‌బీఎస్కే నిర్వాహకుడు ప్రమోద్‌ ఉన్నారు.
అందుబాటులో జీలుగ విత్తనాలు
పెంబి మండల కేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రంలో సబ్సిడీ జిలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఇన్‌చార్జి ఏడీఏ ఆసం రవి పేర్కొన్నారు. మండల కేంద్రం లోని ఆగ్రో రైతు సేవా కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు జిలుగ విత్తనాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్య క్షుడు పుప్పాల శంకర్‌, వైస్‌ ఎంపీపీ బైరెడ్డి గంగారెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ భూక్యా గోవింద్‌, సర్పంచ్‌లు పూర్ణచందర్‌ గౌడ్‌, సుధాకర్‌, ఏఈవో గంగాజల, నాయకులు సల్లా నరేందర్‌ రెడ్డి, సూదుల శంకర్‌. ఆర్‌బీఎస్కే నిర్వాహకుడు ప్రమోద్‌ పాల్గొన్నారు.
డీలర్లు నిబంధనలు పాటించాలి
కుంటాల, మే, 26 : ఎరువులు, విత్తన విక్రయ డీలర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ఏవో సోమ లింగారెడ్డి అన్నా రు. స్థానిక వ్యవసాయ కార్యాలయంలో డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొనుగోలు చేసిన రైతులకు బిల్లు తప్పకుం డా ఇవ్వాలని సూచించారు. ధరల పట్టికను బోర్డుపై ఉంచాలన్నారు. నిషేదిత పురుగు, కలుపు మందులు విక్రయిస్తే చర్యలు తీసు కుంటామని తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

ట్రెండింగ్‌

Advertisement