e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home జిల్లాలు లాక్‌డౌన్‌ ఆంక్షలు కఠినతరం

లాక్‌డౌన్‌ ఆంక్షలు కఠినతరం

లాక్‌డౌన్‌ ఆంక్షలు కఠినతరం

14 రోజుల్లో 3,672 కేసులు నమోదు
రూ.32.56లక్షల జరిమానా విధింపు

రాజన్న సిరిసిల్ల, మే 25 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్‌ వ్యాప్తికి చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ జిల్లాలో పకడ్బందీగా అమలవుతున్నది. నిబంధనల ఉల్లంఘనను పోలీస్‌శాఖ తీవ్రంగా పరిగణిస్తున్నది. ఉదయం 10గంటల తర్వాత అకారణంగా బయటకు వచ్చి వాహనాలపై తిరుగుతున్న 302 మంది వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు. మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా తిరుగుతున్న 181 మంది కేసులు నమోదు చేశారు. సడలింపు సమయం ముగిసినా తెరిచి ఉంచిన 72 దుకాణాలకు అధికారులు సీల్‌ వేశారు. 347 పిటి కేసులు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా 14 రోజుల లాక్‌డౌన్‌ కాలంలో 3,672 కేసులు నమోదు చేసి, రూ.32.56లక్షల జరిమానా విధించింది. జిల్లాలో లాక్‌డౌన్‌ అంక్షలను పోలీసు శాఖ కఠినతరం చేసింది. నాలుగు గంటల సడలింపును ఆసరాగా చేసుకుని కొందరు ఇష్టారీతిన రోడ్లపైన తిరుగుతున్నారు. ఎక్కడ చూసిన జనం గుంపులుగా పోగవడం, రోడ్లపైన వాహనాల రద్దీ పెరగడంతో ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగారు. డీఎస్పీలు చంద్రశేఖర్‌, చంద్రకాంత్‌, సీఐలు అనిల్‌కుమార్‌, ఉపేంద్ర, మౌళి, బన్సీలాల్‌, వెంకటేశ్‌, శ్రీలతతో కలిసి జిల్లా అంతటా విస్తృతంగా పర్యటిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను తనిఖీ చేస్తున్నారు. నాలుగు గంటల సడలింపు సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టారు. మార్కెట్లు, నిత్యావసర దుకాణాల ఎదుట భౌతిక దూరం పాటించేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా రు.

ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు రోజంతా పహారా కాస్తూ రోడ్లపైకి ప్రజలు రాకుండా నిఘా పెట్టారు. 10గంటలు దాటిన తర్వాత బయటకెవరూ రావద్దన్న పోలీసుల హెచ్చరికలు కొందరు బేఖాతర్‌ చేస్తున్నారు. అలాంటి వారిపై పోలీసులు సీరియస్‌గా యాక్షన్‌ తీసుకుంటున్నారు. వాహనాలను ఎక్కడికక్కడే నిలిపి సీజ్‌ చేస్తున్నారు. మాస్కులు ధరించని వారిపై కేసులు పెడుతున్నారు. సడలింపు సమయం ముగిసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో తెరిచి ఉంచిన దుకాణాలకు సీల్‌ వేస్తున్నారు. లాక్‌డౌన్‌ ఈనెల 12న ప్రభుత్వం విధించగా, పోలీసులు భారీ ఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. 14రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 3,672 కేసులు నమోదు చేశారు. ఇందులో 302 వాహనాలను సీజ్‌ చేశారు. మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా తిరుగుతున్న 181 మందిపై కేసులు పెట్టారు. సడలింపు సమయం ముగిసినా తెరిచి ఉంచిన 72 దుకాణాలకు సీల్‌ వేశారు. 347 పిటి కేసులు నమోదు చేయగా, రూ.32.56లక్షల జరిమానా విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా కేసులు తప్పవని ఎస్పీ రాహుల్‌హెగ్డే హెచ్చరించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లాక్‌డౌన్‌ ఆంక్షలు కఠినతరం

ట్రెండింగ్‌

Advertisement