e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home జిల్లాలు ఈటల తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం

ఈటల తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం

ఈటల తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం

అన్నం పెట్టినోళ్లకే సున్నం పెట్టాలని చూసిండు
పార్టీ విచ్ఛిన్నానికి కుట్ర చేసిండు
నీ నిజ స్వరూపం ఏంటో బయటపెడతా
నీకు వ్యతిరేక సిద్ధాంతాలున్న పార్టీలో ఎందుకు చేరినవ్‌
తల్లి లాంటి టీఆర్‌ఎస్‌ పార్టీని, తండ్రి లాంటి కేసీఆర్‌ను అనడానికి నోరెలా వచ్చింది
హుజూరాబాద్‌లో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ధ్వజం
అట్టహాసంగా స్వాగత బైక్‌ ర్యాలీ

హుజూరాబాద్‌, జూన్‌ 24: బీజేపీ నేత ఈటల రాజేందర్‌ తిన్నింటి వాసాలు లెక్కబెట్టే రకమని, పార్టీలో జరిగే అంతర్గత విషయాలను బహిర్గతం చేసి పార్టీని విచ్ఛిన్నం చేసే కుట్ర పన్నాడని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ధ్వజమెత్తారు. కోళ్ల ఫారంలో పని చేసుకుంటున్న ఈటలకు రాజకీయ ఓనమాలు నేర్పి, పెంచి పెద్ద చేసి అన్నం పెట్టిన కేసీఆర్‌కు సున్నం పెట్టే ప్రయత్నం చేసిండని మండిపడ్డారు. గురువారం హుజూరాబాద్‌ పట్టణంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉద్యమ సమయం నుంచి అనేక పదవులు కట్టబెట్టి రాష్ట్రంలోనే నంబర్‌-2 స్థానాన్ని రాజకీయంగా ఇచ్చిన సీఎం కేసీఆర్‌పై లోపల కత్తులు పెట్టుకొని బయటకు వెటకారంగా నవ్వుతున్న ఈటలను ప్రజలు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆయన నిజస్వరూపాన్ని త్వరలోనే బయటపెడుతామని హెచ్చరించారు. తప్పు ల మీద తప్పులుచేసి కేసీఆర్‌ మీద దుమ్మెత్తి పో యడం చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మరనే విష యం రాజేందర్‌ తెలుసుకోవాలని హితవు పలికారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తప్పులు చేస్తుంటే బర్తరఫ్‌ చేయడం కేసీఆర్‌ తప్పే లా అవుతుందని ప్రశ్నించారు. ఎస్సీ, బీసీల భూ ములు అక్రమంగా గుంజుకుంటే ఆ రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే వాటిపై విచారణ చేయమని కేసీఆర్‌ ఆదేశించారని, ఆ విషయాన్ని పక్కనబెట్టి కేసీఆర్‌పై దుమ్మెత్తి పోయడం ఎంత వరకు సమంజసమని మండిపడ్డారు. భూముల ను అక్రమించుకోలేదు.., కొనుగోలు చేశానని ఆ రోజు విలేకరులతో మాట్లాడిన్‌ కదా.. ఒక కేబినెట్‌ మంత్రిగా ఉండి అసైన్డ్‌ భూములు కొనుగోలు చేయవద్దనే సోయి ఈటలకు లేదా’ అని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ నిర్ణయాలు బయటకు చెప్పవచ్చా
రెవెన్యూ శాఖ ప్రక్షాళనలో భాగంగా కేబినెట్‌లో జరిగే నిర్ణయాలను ఈటల బయటకు చెప్పవచ్చా అని ప్రశ్నించారు. రెవెన్యూ శాఖపై సమీక్షించిన అనంతరం రెవెన్యూ అధికారులను ఇంటికి పిలిపించుకొని రహస్య సమావేశం ఎందుకు పెట్టారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీలో సమ్మె చేయించి రాష్ర్టాన్ని బదనాం చేయాలని చూసిన అశ్వత్థామరెడ్డితో గంటల గంటలు చీకటి రూంలో చర్చలు పెట్టి చిచ్చు పెట్టే కుట్రలు చేసింది నిజం కాదా అని మండిపడ్డారు. ఇవే కాకుండా కేబినెట్‌, పార్టీలో జరిగే ప్రతి అంతర్గత విషయాలను బహిర్గతం చేసి పార్టీని విచ్చిన్నం చేసే కుట్ర పన్నాడని మండిపడ్డారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టి, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే ప్రయత్నం చేసిండని మండిపడ్డారు.
నీకు విరుద్ధమైన పార్టీలో ఎందుకు చేరినవ్‌..
వామపక్ష భావజాలం, అంబేద్కరిజం, జ్యోతిబాపూలే భావజాలం ఇష్టం అని చెప్పుకునే ఈటల వాటికి విరుద్ధమైన సిద్ధాంతాలు ఉన్న బీజేపీలో ఎందుకు చేరాడో ఆయనకే తెలియాలని, వీటన్నింటినీ ప్రజలు గ్రహిస్తున్నారనే విషయం మరిచిపోవద్దన్నారు. ప్రధానంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీలో చేరిన నీవు.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏం సమాధానం చెబుతావో ప్రశ్నించారు. రోహిత్‌ వేముల లాంటి ఎందరో అణిముత్యాలతో పాటు ఎందరో దళితులను అణిచివేసిన బావజాలం ఉన్న బీజేపీలో ఎట్లా చేరినవో తప్పకుండా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.
బీజేపీ పెత్తందారుల పార్టీ అన్నవు కదా
‘బీజేపీ సిద్ధాంతాలు పేదోళ్లకు, దళితులకు, గిరిజనులకు, మైనార్టీలకు వ్యతిరేకమని, అదొక పెత్తందారుల పార్టీ అని పదేపదే చెప్పి, ఇప్పుడు అదే పార్టీలోకి వెళ్లిన నీవు పెత్తందారివని అర్థం చేసుకోవచ్చునని మండిపడ్డారు. త్వరలోనే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ బయటపెడుతామని, దీనికి బీజేపీ నాయకులు ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలన్నారు? కరోనా వ్యాక్సిన్లు ఇస్తలేరని మొన్నటికి మొన్న కేంద్రాన్ని తిట్టినవ్‌ కదా, ఇప్పుడు ఏమన్నా కేంద్రం చాటుమాటుగా తెలంగాణకు వ్యాక్సిన్లు ఇస్తం రాజేందర్‌ అని చెబితే బీజేపీలో చేరవా అని ప్రశ్నించారు. రైతులకు నడ్డివిరిచేందుకే బీజేపీ నల్ల చట్టాలు తెచ్చిందన్నావు కదా..? మరి చాటుగా నల్ల చట్టాలు రద్దు చేస్తామని కేంద్రం చెప్పినందుకు బీజేపీలో చేరినవా అని ప్రశ్నించారు. ఇవే కాకుండా డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు పెంచి సామాన్యులను దోచుకుంటున్నారని మాట్లాడిన నీవు, ఇప్పుడు అదే పార్టీలో చేరితే వాటిని సమర్థించినట్లే అవుతుంది కదా అని వివరించారు. ఇన్ని రోజులు మాట్లాడిన దానికి, చేసినదానికి పోలిక పొంతన ఏమైనా ఉందా.. సమాధానం చెప్పాలన్నారు.
టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి
గతంలో జరిగిన అభివృద్ధి అయినా.. భవిష్యత్‌లో నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా కేవలం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా పథకం కేసీఆర్‌ ప్రారంభించింది ఈ నియోజకవర్గంలోనేనని, అలాంటి పథకాలను విమర్శించిన ఈటల పేదల వైపు ఉన్నట్లా లేనట్లా అని తేల్చాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏనాడూ ఈటల పాల్పడలేదని, కేవలం అందివచ్చిన పదవులను అడ్డుపెట్టుకొని ఆస్తులు, అంతస్తులు కూడబెట్టుకొని పెద్దగా కావాలని ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. నాలుగు వేల డబుల్‌బెడ్రూం ఇండ్లను మంజూరు చేస్తే.. వాటిని ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. అయితే పేదోళ్ల సంక్షేమం మరిచి ఐదెకరాల్లో బ్రహ్మండంగా కోట కట్టుకున్నవు రాజేంద్రన్న అని ఏద్దెవా చేశారు. దీన్నిబట్టి రాజేందర్‌ వైఖరి ఏమిటో తెలుసుకోవచ్చు. ఆయన కోసమే ఆయన తప్ప.. నియోజకవర్గ ప్రజల కోసం ఈటల చేసింది శూన్యమే అని దుయ్యబట్టారు.
కేసీఆర్‌ ఏం తక్కువ చేసిండో చెప్పాలి
కోళ్ల ఫారం నడుపుకుంటున్న ఈటలను కేసీఆర్‌ దగ్గరకు తీసి అందలం ఎక్కిస్తే ఆయనకే వెన్నుపోటు పొడువాలని కుట్రలు చేసిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని మండిపడ్డారు. అప్పటి కమలాపూర్‌ నియోజకవర్గంలో బలంగా ఉన్న టీఆర్‌ఎస్‌లో ఎందరో నాయకులను కాదని ఇతరులకు టికెట్‌ ఇచ్చి గెలిపించింది వాస్తవం కాదా అని దుయ్యబట్టారు. ఈటలను కేసీఆర్‌ తమ్ముడిలా భావించి దగ్గరికి తీసి రెండు సార్లు మంత్రి పదవులు కట్టబెడితే నియంత అని, దొరల పాలన అని నోటికి ఎంత వస్తే అంత అనడం రాజేందర్‌కు తగునా అని మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజనలో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అప్పటికే బలంగా ఉన్న కెప్టెన్‌ లక్ష్మీకాంతారావును పక్కనబెట్టి టికెట్‌ ఇస్తే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా కేసీఆర్‌ను విమర్శించడం ఎంతవరకు సమంజసమన్నారు. తల్లిలాం టి టీఆర్‌ఎస్‌ పార్టీని, తండ్రిలాంటి సీఎం కేసీఆర్‌ ను విమర్శించడానికి నోరెలా వచ్చిందని మండిప డ్డారు. హుజూరాబాద్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ కు కంచుకోట అని, కాషాయపు కోట కాదని, భవిష్యత్‌లో కాదన్నారు. నాడు, నేడు ఎప్పుడైనా గు లాబీ కోటదేనని, కేసీఆర్‌ నాయకత్వాన్ని ఇక్కడి ప్రజలు సమర్థిస్తారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గులాబీ జెండాను ఎగురవేసి కేసీఆర్‌కు కానుకగా అందజేస్తామని ధీమా వ్యక్తం చేశా రు. సమావేశంలో నాయకులు గెల్లు శ్రీనివాస్‌, వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, బండ శ్రీనివాస్‌, గందె రాధిక, కొలిపాక శ్రీనివాస్‌ ఉన్నారు.
టీఆర్‌ఎస్‌ భారీ బైక్‌ ర్యాలీ
హుజూరాబాద్‌లో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ప ర్యటన సందర్భంగా టీఆర్‌ఎస్వీ, టీఆర్‌ఎస్‌వై, ఇతర విభాగాల యువకులు హుజూరాబాద్‌ పట్టణంలో భారీ బైక్‌ ర్యాలీ తీశారు. ఈసందర్భంగా బాల్క సు మన్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడే ఉన్న అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈటల తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం
ఈటల తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం
ఈటల తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం

ట్రెండింగ్‌

Advertisement