e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home జిల్లాలు రైతుల అభ్యున్నతే సర్కారు ధ్యేయం

రైతుల అభ్యున్నతే సర్కారు ధ్యేయం

రైతుల అభ్యున్నతే సర్కారు ధ్యేయం

రైతులు నష్టపోకుండా ప్రభుత్వమే ధాన్యం కొంటున్నది..
కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
అధికారుల సమీక్షలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌

హాజీపూర్‌, మే 24 : రైతుల అభ్యున్నతే సర్కారు ధ్యేయమని చెన్నూర్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బా ల్క సుమన్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య, డీసీఎంఎస్‌ చైర్మన్‌ తిప్పని లింగయ్యతో కలి సి సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. బీజేపీ పాలిత ప్రాం తాలు, ఇతర రాష్ర్ర్టాల్లో ఇంత పెద్ద మొత్తంలో ధా న్యం సేకరించిన దాఖాలాలు లేవన్నారు. అయినప్పటికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడడం విడ్డూరంగా ఉందని, ఇప్పటికైనా రా ష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు మానుకోకుంటే రైతు లు తరిమి కొడుతారని హెచ్చరించారు. జిల్లాలో మొత్తం 2.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధా న్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 1.51 లక్షల మెట్రిక్‌ టన్నులను సేకరించామన్నా రు. మ రో 10 వేల మెట్రిక్‌ టన్నులు అదనంగా వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని మిల్లులకు 1.10 లక్షల మెట్రిక్‌ టన్నులు, పెద్దపెల్లి, జగిత్యాల, కరీంనగర్‌, వరంగల్‌ అర్బన్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి జిల్లాలకు 1.30 టన్నుల ధాన్యాన్ని తరలిస్తామని చెప్పారు.ఈ నెల 28న మరోసారి సమావే శం నిర్వహించి ఈ నెలాఖరులోగా ధాన్యాన్ని సేకరించేందుకు అన్ని చర్యలను తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు. లాక్‌డౌ నేపథ్యంలో సివిల్‌ సైప్లె, కొనుగొలు కేంద్రాల నిర్వాహకులు, హమాలీ, గుమస్తాలు తదితర ధాన్యం సేకరణ సిబ్బందిని పోలీసులు అడ్డుకుంటున్నారని తన దృష్టికి వచ్చిందని, డీసీపీ ఉదయ్‌కుమార్‌ రెడ్డితో మాట్లాడానని, ఇకముం దు ఇబ్బందులుఉండవని పేర్కొన్నారు.
చేతకాని దద్దమ్మలు బీజేపీ నాయకులు..
బీజేపీ నాయకులు చేతకాని దద్దమ్మలని విప్‌ బా ల్క సుమన్‌ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమ కోసం పథకాలు అమలు చేస్తుంటే, బీజే పీ నాయకులు రైతు ఉద్యమాన్ని అణిచి వేసి కా ర్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టేలా వ్యవహరిస్తుందన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ఇప్పటికే తప్పుడు ప్రచారం చేసినందుకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటికే రైతు ల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేశామన్నారు. బండి సంజయ్‌కు దమ్ముంటే కేంద్రంతో మాట్లాడి రాష్ర్టానికి వ్యాక్సి న్లు తెప్పించాలని డిమాండ్‌ చేశారు.
జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ
జిల్లా కేంద్రంలోని అక్రిడిటేషన్‌ కార్డు గల జర్నలిస్టులకు బాల్క ఫౌండేషన్‌ ఆధ్వర్వంలో త్వరలోనే నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నట్లు బాల్క సుమన్‌ తెలిపారు. అలాగే జిల్లాలో జర్నలిస్టులందరికీ వ్యాక్సిన్‌ వేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరానని పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష
జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లోని చాంబర్‌లో కలెక్టర్‌ భారతీ హోళికేరి, అదనపు కలెక్టర్‌ మధుసుదన్‌ నాయక్‌, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ జిల్లా అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా కరోనా సమయంలో రైతులు నష్టపోకుం డా ఉండేందుకు ధాన్యం కొనుగోళ్లు చేపట్టామన్నారు. అనంతరం కలెక్టర్‌ భారతీ హోళికేరి మా ట్లాడుతూ జిల్లాలో 1 లక్షా 10 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యం కాగా, దాదాపు పూర్తి చేశామన్నారు. లక్ష్యానికి మించి అదనంగా ఉన్న ధాన్యాన్ని నిబంధనల మేరకు ఇతర జిల్లాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వర్షాకాలం ప్రారంభంలోగా ప్రక్రియ పూ ర్తి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు కృషి చేస్తున్నారన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సేకరించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శేషాద్రి, జిల్లా వ్యవసాయ అ ధికారి వీరయ్య, జిల్లా రవాణా శాఖ అధికారి లె క్కల కిష్టయ్య, జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్‌ గోపాల్‌, డీసీసీబీ చైర్మన్‌ లింగయ్య, రైస్‌ మిల్ల ర్లు, గుత్తేదార్లు, లారీ అసోషియేషన్‌ ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
భవనం కూల్చివేత పనుల పరిశీలన
చెన్నూర్‌, మే 24: పట్టణంలోని పురాతన సర్కా రు దవాఖాన భవనం కూల్చివేత పనులను బాల్క సుమన్‌ పరిశీలించారు. ఈ భవనం శిథిలావస్థకు చేరడంతో, దాని స్థానంలో నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ. 7 కోట్లను ఆయన మంజూరు చేయించారు. వీలైనంత త్వరగా శిథిలాలను తొలగించి, స్థలాన్ని చదును చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. భవన నిర్మాణం కోసం పలు సూచనలు చేశారు. వైస్‌ ఎంపీపీ వెన్నపురెడ్డి బాపురెడ్డి, టీఆర్‌ఎస్‌ నా యకులు రాంలాల్‌ గిల్డా, జాడి తిరుపతి, నాయిని సతీశ్‌, మేడ సురేశ్‌రెడ్డి, మహేందర్‌ పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల్లో వేగం పెంచి గడువు లోగా పూర్తి చేయాలని ప్ర భు త్వ విప్‌ బాల్క సుమన్‌ అధికారులను ఆదేశించా రు. క్యాంప్‌ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనులు ఏదశలో ఉన్నాయో? అధికారులను అడిగి తెలుసుకున్నా రు. పనుల నిర్వహణలో ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకవస్తే పరిష్కరిస్తానని తెలిపారు.
ప్రతీ ధాన్యం గింజన కొనుగోలు చేస్తాం
చెన్నూర్‌ రూరల్‌, మే 24: రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని చెన్నూర్‌ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. మండలంలోని ఆస్నాద్‌లోని కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు. డబ్బులు ఖాతాల్లో త్వరగా జమయ్యేలా చూడాలని సూచించారు. ఆయన వెంట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బత్తుల సమ్మయ్య, మాజీ జడ్పీటీసీ బెల్లంకొండ కరుణాసాగర్‌ రావు, సర్పంచ్‌ నాగభూషణం చారి, ఉప సర్పంచ్‌ నస్కూరి శ్రీనివాస్‌, నాయకులు రత్న సమ్మిరెడ్డి, నరసింహచారి, వెంకటేశ్వర్‌ రావు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రైతుల అభ్యున్నతే సర్కారు ధ్యేయం

ట్రెండింగ్‌

Advertisement