e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home జిల్లాలు రెండో విడుత ఫీవర్‌ సర్వే షురూ..

రెండో విడుత ఫీవర్‌ సర్వే షురూ..

రెండో విడుత ఫీవర్‌ సర్వే షురూ..

ఇంటింటా వివరాలు సేకరించిన కార్యదర్శులు, ఏఎన్‌ఎంలు
హాజీపూర్‌, మే 24 : మండలంలోని దొనబండ, నర్సింగాపూర్‌, హాజీపూర్‌, చిన్నగోపాల్‌ పూర్‌, కొత్త కొండాపూర్‌, వేంపల్లి, నంనూర్‌, ర్యాలీ తదితర గ్రామాల్లో రెండో విడుత ఇంటింటా ఫీవర్‌ సర్వేను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్‌ఎంలు గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ వివరాలు సేకరించారు. పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ.. గ్రామంలో ఎవరికైనా కొవిడ్‌ లక్షణాలుంటే వెంటనే గ్రామపంచాయతీ కార్యాలయంలో లేదా ఆశ కార్యకర్తలకు, ఏఎన్‌ఎంలకు వెంటనే చెప్పాలని సూచించారు.
తాండూర్‌ మండలంలో..
తాండూర్‌, మే 24 : మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికీ వెళ్లి ఫీవర్‌ సర్వే నిర్వహించారు. కొవిడ్‌ లక్షణాలున్న వారి వివరాలు నమోదు చేశారు. ఈ సందర్భంగా మాదారం త్రీ ఇైంక్లెన్‌, చౌటపల్లి, రాజీవ్‌నగర్‌, వివిధ గ్రామ పంచాయతీల పరిధిలో కార్యదర్శులు, ఏఎన్‌ఎంలు, గ్రామపంచాయతీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కొవిడ్‌ లక్షణాలున్న వారు పరీక్షలు చేసుకున్నారా..? లేదా..? అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మామూలుగా అస్వస్థతతో ఉన్న వారికి అవసరమైన మందులు అందజేసి, కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యదర్శులు, ఏఎన్‌ఎంలు, వీఆర్‌ఏలు, పంచాయతీ సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
చెన్నూర్‌ మండలంలో..
చెన్నూర్‌ రూరల్‌, మే 24: గ్రామాల్లో జ్వరంతో బాధపడుతున్న వారు ఆయా గ్రామాల పరిధిలోని ఏఎన్‌ఎంలకు సమాచారం అందించాలని అంగ్రాజ్‌పల్లి పీహెచ్‌సీ హెచ్‌ఈవో జగదీశ్‌ అన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు మండలంలో వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ తిరుగుతూ సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. మండలంలోని ఆస్నాద్‌, కొమ్మెర, సుద్దాల, బీరెల్లి, రచ్చపల్లి, నాగాపూర్‌ గ్రామాల్లో ప్రతి ఇంటికి తిరుగుతూ సోమవారం జ్వరం సర్వే చేపట్టారు. గ్రామస్తుల సహకారంతోనే కరోనాను కట్టడి చేయవచ్చని తెలిపారు. కరోనా బాధితులకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అండగా ఉండి ధైర్యం చెప్పాలని సూచించారు. ప్రతి ఇంటికీ తిరుగుతూ జ్వరం ఉన్న వారి వివరాలతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న వారి వివరాలను సేకరించారు. ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బా ధపడుతున్న వారు అంగ్రాజ్‌పల్లి దవాఖానలతో కరోనా పరీక్షలు చేసుకోవాలని తెలిపారు. వైద్య సిబ్బందికి పలు సూచనలు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రెండో విడుత ఫీవర్‌ సర్వే షురూ..

ట్రెండింగ్‌

Advertisement