e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home జిల్లాలు రఘునాథపాలేన్ని రోల్‌ మోడల్‌ చేస్తా..

రఘునాథపాలేన్ని రోల్‌ మోడల్‌ చేస్తా..

రఘునాథపాలేన్ని రోల్‌ మోడల్‌ చేస్తా..

-రవాణా శాఖ మంత్రి అజయ్‌
రఘునాథపాలెం, జూన్‌ 23: ఖమ్మం నియోజకవర్గంలో ఏకైక మండలంగా ఉన్న రఘునాథపాలేన్ని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. రఘునాథపాలేన్ని రోల్‌మోడల్‌గా చేసి ఆదర్శంగా తయారు చేస్తానన్నారు. పీఎంఎస్‌వై పథకం కింద చింతగుర్తి గ్రామంలో రూ.3.67 కోట్ల వ్యయంతో, వేపకుంట్ల గ్రామంలో రూ.3.36 కోట్ల వ్యయంతో రోడ్ల విస్తరణ పనులకు సంబంధించిన పైలాన్‌లను ఖమ్మం కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైనన్ని నిధులు తీసుకొచ్చే బాధ్యత తనదేనని చెప్పిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పల్లెప్రగతి పనుల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వేపకుంట్ల ప్రజలు ఎంతో చైతన్యమంతులని, యువకుడైన సర్పంచ్‌ దారా శ్యాం గ్రామాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ఏఎంసీ డైరెక్టర్‌ పొట్లపల్లి రాజా, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కుర్రా భాస్కర్‌రావు నేతృత్వంలో మండలాన్ని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గత రెండు దఫాల పల్లెప్రగతిలో చింతగుర్తిని ఆదర్శంగా నిలిపిన సర్పంచ్‌ మెంటెం రామారావును అభినందించారు.

త్వరలో మండలంలోని 37 గ్రామ పంచాయతీల్లోని ప్రధాన సెంటర్లలో సుడా నిధులతో హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అనంతరం చింతగుర్తిలోని పల్లెప్రకృతి వనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాలకు ఆయా గ్రామాల సర్పంచ్‌లు దారా శ్యాం, మెంటెం రామారావు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, ఏఎంసీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, వైస్‌ చైర్మన్‌ పిన్ని కోటేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కుర్రా భాస్కర్‌రావు, జడ్పీటీసీ మాళోతు ప్రియాంక, ఎంపీపీ గౌరి, ఏఎంసీ డైరెక్టర్‌ పొట్లపల్లి రాజా, ఎంపీటీసీలు ఉప్పెర్ల వనజారాణి, మాళోతు లక్ష్మి, చింతగుర్తి మాజీ ఎంపీటీసీ మాళోతు రాంబాబు, ఆత్మచైర్మన్‌ బోయినపల్లి లక్ష్మణ్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కొత్తా కొమరయ్య, తాతా వెంకటేశ్వర్లు, బండి నాగేశ్వరరావు, మాధంశెట్టి హరిప్రసాద్‌, నున్నా శ్రీనివాసరావు, చెరుకూరి ప్రదీప్‌, కొంటెముక్కల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రఘునాథపాలేన్ని రోల్‌ మోడల్‌ చేస్తా..
రఘునాథపాలేన్ని రోల్‌ మోడల్‌ చేస్తా..
రఘునాథపాలేన్ని రోల్‌ మోడల్‌ చేస్తా..

ట్రెండింగ్‌

Advertisement