e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home జిల్లాలు 50 శాతం వేతనాల పెంపునకు కృషి

50 శాతం వేతనాల పెంపునకు కృషి

50 శాతం వేతనాల పెంపునకు కృషి

ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య
గోదావరిఖని, జూన్‌ 18: రానున్న 11వ వేజ్‌బోర్డులో 50 శాతం వేతనాలు పెంచేందుకు కృషి చేస్తామని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి, వేజ్‌బోర్డు పర్మినెంట్‌ మెంబర్‌ సీతారామయ్య తెలిపారు. ఈమేరకు ఆర్జీ-1 పరిధి జీడీకే-1వ గనిపై, స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం మాట్లాడారు. 10వ వేజ్‌బోర్డు కాల పరిమితి ఈ నెల 30వ తేదీతో ముగియనుందని వివరించారు. జూలై 1 నుంచి 11వ వేజ్‌బోర్డు ప్రారంభం కానున్నదని వెల్లడించారు. నాలుగు జాతీయ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన 30 డిమాండ్లపై కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శికి నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. ప్రధానంగా కరువు భత్యం వందశాతం న్యూట్రలైజేషన్‌ చేసి డీపీఈ గైడ్‌లైన్స్‌తో సంబం ధం లేకుండా 50 శాతం పెంచాలని, ఇంక్రిమెంట్‌గా మూడు అదనపు ఇంక్రిమెంట్లు, 8వ వేజ్‌బోర్డు ప్రకారం సర్వీస్‌ వెయిటేజ్‌ ఇవ్వాలని, అండర్‌ గ్రౌండ్‌ అలవెన్సు 25, కోల్‌ఫీల్డు అలవెన్సు 10, నైట్‌షిఫ్టు అలవెన్సు 5 శాతం, చార్జి అలవెన్సు 8 మస్టర్లు, నర్సింగ్‌ పారా మెడికల్‌ అలవెన్సు 5 శాతం, మోటరు సైకిల్‌ అలవెన్సు 10 శాతం, కారు అలవెన్సు 20 శాతం ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. ఓవర్‌ టైం, పీహెచ్‌డీలకు సీలింగ్‌ తొలగించాలని, ఎల్‌ఎల్‌టీసీ కింద రూ.75వేలు, ఎల్‌టీసీ కింద రూ.50వేలు ఇవ్వాలని, సర్వీస్‌ గ్రాట్యుటీని జనవరి 2017 నుంచి అమలు చేయాలని కోరినట్లు వివరించారు. కాం ట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయడంతోపాటు ఈసారి హైపవర్‌ కమిటీ వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. ఏదైనా ప్రమాదంలో కార్మికుడు చనిపోతే రూ.50 లక్షల పరిహారం వర్తింపజేయాలని, రిటైర్డు కార్మికులకు కనీస పెన్షన్‌ రూ.10వేలు ఉండాలని, సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఒక స్కీంను ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు త్వరితగతిన నిర్వహించాలని యాజమాన్యాన్ని కోరారు. సమావేశాల్లో నాయకులు ఎల్‌ ప్రకాశ్‌, వైవీ రావు, మేరుగు రాజయ్య, ఆరెల్లి పోశం, గౌతం గోవర్ధన్‌, మడ్డి ఎల్లా గౌడ్‌, కందుకూరి రాజారత్నం, రంగు శ్రీను, వెంకటరెడ్డి, గండి ప్రసాద్‌, బుర్ర భాస్కర్‌, సతీశ్‌బాబు, రాజయ్య, అబ్బుబాకర్‌, మల్లేశ్‌, ప్రభుదాస్‌, రవీందర్‌, తిరుపతి, శనిగరపు చంద్రశేఖర్‌, సల్ల రవీందర్‌, పరమాత్మ, చంద్రయ్య, రమేశ్‌కుమార్‌ ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
50 శాతం వేతనాల పెంపునకు కృషి
50 శాతం వేతనాల పెంపునకు కృషి
50 శాతం వేతనాల పెంపునకు కృషి

ట్రెండింగ్‌

Advertisement