e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home జిల్లాలు నిర్మల్‌ను ప్రగతి పథంలో నిలబెడతాం

నిర్మల్‌ను ప్రగతి పథంలో నిలబెడతాం

నిర్మల్‌ను ప్రగతి పథంలో నిలబెడతాం

రూ.28 కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులు
పట్టణ ప్రగతితోనే పట్టణాలకు మహర్దశ
మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి పట్టణ సుందరీకరణ పనుల పరిశీలన
సారంగాపూర్‌ మండలం పొట్యాలో విగ్రహ ప్రతిష్ఠాపనకు హాజరు

నిర్మల్‌ అర్బన్‌, జూన్‌18 : పల్లెలు, పట్టణ ప్రాంతాలు శుభ్రంగా, పచ్చదనంతో ఉండేలా చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రజల జీవన ప్ర మాణాలు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తున్నదని, నిర్మల్‌ను ప్రగతిపథంలో నిలబెడతామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. నిర్మల్‌లో పట్టణ ప్రగతిలో భాగంగా శివాజీ చౌక్‌ నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు రూ.5.50 కోట్లతో చేపట్టిన రోడ్డు వెడల్పు, సుందరీకరణ పనులను ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాల్టీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు పట్టణ ప్రగతి కార్యకమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ గ్రామ, పట్టణ ప్రాం తాలకు నెలనెలా నిధులు మంజూరు చేస్తున్నారని వెల్లడించారు. నిర్మల్‌ పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, రోడ్ల విస్తరణకు కూడా వ్యాపారులు, పట్టణ ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. పట్టణ ప్రజలందరి సహకారంతో పనులు చకచకా నడుస్తున్నాయని పేర్కొన్నారు. అన్ని వర్గాలను భాగస్వాములను చేస్తూ నిర్మల్‌ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రానున్న రోజుల్లో రూ.28 కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. పట్టణంలో ఎక్కడా చెత్తలేకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పారిశుధ్యం లోపించకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు. పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వ్యాపారస్తులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
‘స్వచ్ఛ నిర్మల్‌’గా తీర్చిదిద్దాలి..
పట్టణాన్ని ‘స్వచ్ఛ నిర్మల్‌’గా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా నిర్మల్‌ పట్టణంలో ప్లాస్టిక్‌ బాటిల్స్‌, పాలిథిన్‌ కవర్లను రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పారవేసి పరిసరాలను కలుషితం చేయకుండా ఉండేందుకు బ స్టాండ్‌ సమీపంలో రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పా టు చేసిన ప్లాస్టిక్‌ బాటిళ్ల జాలిని పరిశీలించారు. ప్రజలు బాటిళ్లు, పాలిథిన్‌ కవర్లను రోడ్లపై పడేయకుండా జాలిలో వేయాలని తెలిపారు.కార్యక్రమం లో మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, డీసీసీబీ మాజీ చైర్మన్‌ రాంకిషన్‌ రెడ్డి, కౌన్సిలర్లు గండ్రత్‌ రమణ, నేరెళ్ల వేణు, పూదరి రాజేశ్వర్‌, లక్కాకుల నరహరి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, దేవరకోట ఆలయ చైర్మన్‌ లింగంపల్లి లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షుడు ఆమెడ కిషన్‌, నాయకులు అడ్ప పోశెట్టి, కొండ శ్రీధర్‌, అప్పాల వంశీ, మున్సిపల్‌ కమిషనర్‌ బాలకృష్ణ, ఏఈ వినయ్‌ తదితరులున్నారు.
దేవాలయాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ..
సారంగాపూర్‌, జూన్‌ 18 : దేవాలయాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సారంగాపూర్‌ మండలంలోని పొట్యా గ్రామంలో నూతనంగా నిర్మించిన ముత్యాలమ్మ, సార్గమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి మంత్రి ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో వేల దేవాలయాలను ఆధునీకరించామన్నారు. నిర్మల్‌ నియోజకవర్గంలో 500 దేవాలయాలను ఇప్పటి వరకు నిర్మించుకున్నామని తెలిపారు. అడెల్లి పోచమ్మ ఆలయం వద్ద రూ.12 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. పొట్యాలో ముత్యాలమ్మ, సార్గమ్మ దేవాలయాల నిర్మాణం కోసం ఒక్కో గుడికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు గ్రామస్తులకు తెలిపారు. ప్రభుత్వం ఎన్నో బృహత్తర పథకాలు ప్రవేశపెట్టి అన్ని విధాల ప్రజలను ఆదుకుంటున్నదన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లా వెంకట్‌రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వంగ రవీందర్‌డ్డి, అడెల్లి పోచమ్మ దేవస్థాన కమిటీ చైర్మన్‌ అయిటి చందు, డీసీసీబీ డైరెక్టర్‌ అయిర నారాయణరెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఇప్ప మధుకర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ మల్లయ్య, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, దత్తురాం, హాది, సోమిరెడ్డి నారాయణరెడ్డి, మల్లేశ్‌, గంగన్న, గంగారెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నిర్మల్‌ను ప్రగతి పథంలో నిలబెడతాం
నిర్మల్‌ను ప్రగతి పథంలో నిలబెడతాం
నిర్మల్‌ను ప్రగతి పథంలో నిలబెడతాం

ట్రెండింగ్‌

Advertisement