e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home ఖమ్మం ప్రగతి పరవళ్లు!

ప్రగతి పరవళ్లు!

ప్రగతి పరవళ్లు!

సుడా పాలక మండలికి నేటితో ఏడాది
రూ.10 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు
కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఆగని పనులు

ఖమ్మం, జూన్‌ 18 :ఖమ్మం కార్పొరేషన్‌గా రూపాంతరం చెందడడంతో స్తంభాద్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథార్టీని ‘సుడా’ పాలకమండలి ఏర్పాటై నేటితో ఏడాది పూర్తవుతున్నది. గతేడాది ఇదే రోజు సుడాపాలక మండలి చైర్మన్‌గా బచ్చు విజయ్‌కుమార్‌, సలహా మండలి సభ్యులుగా 14 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఏడాది కాలంలో సుడా ఎన్నో అవాంతరాలను అధిగమించి లక్ష్యాన్ని చేరువైంది. ఏడాది పాలనలో సుడా ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.

సుడా పరిధిలోకి వచ్చే గ్రామాలు ఖమ్మం నగరానికి 25 కిలోమీటర్ల పరిధిలోని ఏడు మండలాల్లోని 46 పంచాయతీలను సుడా పరిధిలోకి తీసుకొచ్చారు. వీటిలో ఖమ్మం రూరల్‌ మండలంలోని అరెంపుల, ముత్తగూడెం, గూడూరుపాడు, తీర్థాల, దారేడు, కామంచికల్‌, గోళ్లపాడు, ఎం.వెంకటాయపాలెం, పల్లెగూడెం, పోలేపల్లి, ఎదులాపురం, బారుగూడెం, గుదిమళ్ల, వెంకటగిరి, గుర్రాలపాడు, తెల్దారుపల్లి, మద్దులపల్లి, తల్లంపాడు గ్రామాలున్నాయి. కూసుమంచి మండలంలోని జీళ్లచెరువు, కూసుమంచి, ముదిగొండ మండలంలోని సువర్ణాపురం, ముదిగొండ, ఖానాపురం, కొత్త లక్ష్మీపురం, వెంకటాపురం, చింతకాని మండలంలోని వందనం, కొదుమూరు, లచ్చగూడెం, బస్వాపురం, పందిళ్లపల్లి, చింతకాని, వైరా మండలంలోని వైరా, కొణిజర్ల మండలంలోని తనికెళ్ల, కొణిజర్ల, అమ్మపాలెం, లింగగూడెం, గుండ్రాతి మడుగు, దుద్దిపుడి, పల్లిపాడు గ్రామాలున్నాయి. రఘునాథపాలెం మండలంలోని వీ వెంకటాయపాలెం, రఘునాథపాలెం, చిమ్మపుడి, మంచుకొండ, కోయచెలక, రేగులచెలక
గ్రామాలున్నాయి.

- Advertisement -

ప్రయోజనాలివీ..
ఖమ్మం నగరంలోని 60 డివిజన్లతోపాటు ఖమ్మం రూరల్‌, కూసుమంచి, ముదిగొండ, వైరా, చింతకాని, కొణిజర్ల, రఘునాథపాలెం మండలాల్లోని కొన్ని గ్రామాలు సుడాలో విలీనమయ్యాయి. ఈ గ్రామపంచాయతీలోని రోడ్లు, డ్రైయిన్లు, ఇతర మౌలిక వసతుల కల్పన బాధ్యత సుడాదే. 2011 జనాభా లెక్కల ప్రకారం 697 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలోని 3.95 లక్షల జనాభా ఉంది. రానున్న 40 ఏళ్ల అవసరాలను అంచనా వేసి మాస్టర్‌ ప్లాన్‌ను తయారు చేశారు. సుడా పరిధిలోకి వచ్చే గ్రామాల్లో ఎలాంటి నిర్మాణాలు జరుగాలన్నా.. సుడా నుంచి అనుమతి తీసుకోవాలి. భూ విక్రయాలు, ఇంటి నిర్మాణాలు, రహదారులు సుడా మాస్టర్‌ ప్లాన్‌ ఆధారంగా జరుగుతాయి. తాగునీరు, మురుగు కాల్వల వ్యవస్థను మరింత పటిష్టం చేస్తారు. లే అవుట్‌ అనుమతులు, అనుమతులు లేని భవన నిర్మాణాలను క్రమబద్ధీకరించే అధికారం సుడాకు ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, భారీ ఉద్యానవనాలు, థియేటర్లు, పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక రవాణ వ్యవస్థకు సుడా అనుమతి తప్పనిసరి.

ఏడాది పాలన సంతృప్తికరంగా ఉంది.
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆశీస్సులతో సుడా అభివృద్ధికి కృషి చేస్తున్నా.. సలహా మండలి సభ్యుల సహకారంతో సుడా పరిధిలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నాం.. ప్రాధాన్యతాక్రమంలో గ్రామాల్లో మౌలిక సదుపాలయాల కల్పనకు నిధులు కేటాయిస్తున్నాం. కరోనాతో నిధుల రాబడిలో కొంత వెనుకబాటులో ఉన్నాం.. పరిస్థితులు చక్కబడితే నిధులు అనుకున్న వాటికంటే ఎక్కువ వస్తాయి. అన్ని గ్రామాల్లో రహదారులు, డ్రైన్లు, సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్ల నిర్మిస్తున్నాం. ఏడాది పాలన సంతృప్తికరంగా ఉంది. -సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రగతి పరవళ్లు!
ప్రగతి పరవళ్లు!
ప్రగతి పరవళ్లు!

ట్రెండింగ్‌

Advertisement