e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home జిల్లాలు పేదల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం

పేదల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం

గద్వాల,సెప్టెంబర్‌17: పేదల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో గద్వాల పట్టణానికి చెందిన అక్తర్‌కు రూ.45వేలు, కేటీదొడ్డి మండలంలోని గువ్వల దిన్నె గ్రామానికి చెందిన కర్రెమ్మకు రూ.45 వేలు సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి చెక్కులు మంజూరు కాగా శుక్రవారం వారి కుటుంబసభ్యులకు వాటిని ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలు అనారోగ్యాల పడి అవస్థలు పడకుండా వారు మెరుగైన వైద్యం చేయించుకునేందుకు సీఎం సహాయనిధి ద్వారా చేయూతనందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్‌ చైర్మన్‌ సుభాన్‌, ఎంపీపీ విజయ్‌కుమార్‌, జములమ్మ ఆలయ కమిటీ చైర్మన్‌ సతీశ్‌కుమార్‌, నాయకులు చక్రధర్‌రెడ్డి, చక్రధర్‌రావు, వెంకటేశ్‌గౌడ్‌ పాల్గొన్నారు.
రైతు కుటుంబాలకు అండగా ప్రభుత్వం
రైతు కుటుంబాలకు అండగా ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని క్యాంపుకార్యాలయంలో మల్దకల్‌ మండలం పాల్వాయి గ్రామానికి చెందిన రైతు మహబూబ్‌సాహేబ్‌ మృతిచెందగా ఆయన కుమారుడు వాహిద్‌కు ప్రభు త్వం నుంచి మంజూరైన రూ.5లక్షల రైతు బీమా చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో పాల్వాయి సర్పంచ్‌ శివరామిరెడ్డి,మాజీ ఎంపీటీసీ ఎల్లప్ప పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌ కమిటీల వివరాలు అందజేత
కొన్ని రోజులుగా నియోజకవర్గంలో గ్రామ, మండల, పట్టణ కమిటీలు ఏర్పాటు చేస్తుండగా గ్రామ, మండల, పట్టణ ప్రాంతాల్లో పూర్త యిన కమిటీ వివరాలను క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి అందజేశారు. కార్యక్రమం లో గట్టు ఎంపీపీ విజయ్‌కుమార్‌, నాయకులు చక్రధర్‌రావు, తిమ్మప్ప, ఉరుకుందు తదితరులు ఉన్నారు.
అన్నదానం మహాదానం
గద్వాల అర్బన్‌, సెప్టెంబర్‌ 17 : అన్నదానం మహాదానమని ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలో ని 32వ వార్డులో కాలనీవాసులు ఏర్పాటు చేసిన వినాయకుడిని దర్శించుకున్నారు. అనంతరం కాలనీవాసులు నిర్వహించిన అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గట్టు మండలం మాచర్ల గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నా యకుడి ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయ్‌కుమార్‌, జెడ్పీటీసీ రాజశేఖర్‌, నాయకులు రామకృష్ణ, వెంకటేశ్‌, ఉరుకుంద, మహేశ్‌ ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement