e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home జిల్లాలు అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు

అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు

అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు

త్వరలోనే రేషన్‌ కార్డులు అందిస్తాం..
ఆపత్కాలంలోనూ సంక్షేమ పథకాలు ఆగలేదు.
మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
సిద్దాపూర్‌లో రూ. 31. 80 కోట్లతో 600 ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ

నిర్మల్‌ అర్బన్‌, జూన్‌ 17: అర్హులందరికీ డబు ల్‌ బెడ్‌ రూం ఇండ్లు అందజేస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. నిర్మల్‌ పట్టణ వాసుల కోసం సిద్దాపూర్‌లో రూ. 31.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 600 డబుల్‌బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పేదోడు రెండు పడకల ఇంటిలో సకల సౌకర్యాలతో గౌరవంగా జీవించాల సీఎం కేసీఆర్‌ మహోన్నత ఆశయం మేరకు ప్రభుత్వం ఈ ఇండ్లను నిర్మించి ఇస్తున్నదన్నారు. వీటితో కలిపి పట్టణ వాసుల కోసం 2100 ఇండ్లు నిర్మిస్తున్నామని పే ర్కొన్నా .

సొంత స్థలం ఉన్న వారికి కూడా ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం అండగా నిలువ నుం దని, ఈ మేరకు పూర్తి మార్గదర్శకాలను సీఎం కేసీఆర్‌ త్వరలోనే విడుదల చేస్తారని స్పష్టం చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ఆగడం లేదని అన్ని వర్గాలకు ఆసరాగా ప్రభుత్వం నిలుస్తున్నద ని గుర్తు చేశా . ముఖ్యంగా రైతులకు అన్ని విధా లుగా సాగుకు భరోసానిస్తున్నట్లు చెప్పారు. నిర్మల్‌ జిల్లాలో వరి ద్వారా రైతులకు రూ. 350 కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపారు. త్వరలోనే అర్హులందరికీ ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేయనుందని చెప్పారు. అనంతరం మొక్కను నాటారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ కొరిపెల్లి విజయలక్ష్మి, మున్సిపల్‌ చై ర్మన్‌ ఈశ్వర్‌, ఎఫ్‌ఎస్సీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీ రాజేందర్‌, డీసీసీబీ మాజీ చైర్మన్‌ రాంకిషన్‌ రెడ్డి, పట్ట ణాధ్యక్షుడు మారుగొండ రాము, మండల మాజీ అధ్యక్షుడు ముత్యం రెడ్డి, స్థానిక కౌన్సిలర్‌ నామె డ రమ్య విజయ్‌, కౌన్సిలర్లు బిట్లింగ్‌ నవీన్‌, పూ దరి రాజేశ్వర్‌, నాయకులు అడ్ప పోశెట్టి, కొండ శ్రీధర్‌ తదితరులున్నారు.
సోన్‌, జూన్‌ 17: సోన్‌ మండలంలోని కడ్తాల్‌ గ్రామానికి చెందిన విమేశ్‌ కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొం దాడు. ఈ క్రమంలో తనకు సాయమందించాలని సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో బాధితుడికి మంజూరైన రూ. 55వేల చెక్కు ను అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తన నివాస భవనంలో గు రువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వీ.సత్యనారాయణగౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ గం డ్రత్‌ ఈశ్వర్‌, నిర్మల్‌ మాజీ మండల కన్వీనర్‌ ముత్యంరెడ్డి, గ్రామ ఉప సర్పం చ్‌ పుట్టి సాయేందర్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ దాసు, వా ర్డుమెంబర్లు సాయిరాం, స్వామి, మల్కన్న, పోశె ట్టి, తదితరులు పాల్గొన్నారు.
ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రోత్సాహం
నిర్మల్‌ టౌన్‌, జూన్‌ 17: రాష్ట్రంలో ఆయిల్‌ సీ డ్‌ పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని మం త్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని దివ్య గార్డెన్‌లో వ్యవసాయశాఖ ఆ ధ్వర్యంలో వానకాలం పంటల సాగు విధానంపై గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని పేర్కొన్నారు. రై తులకు పంట పెట్టుబడి సాయం, రైతుబీమా, స బ్సిడీ విత్తనాలు, వ్యవసాయ అనుబంధ పశు పో షణను ప్రోత్సహిస్తున్నదన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున నీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్నదని స్ప ష్టం చేశారు. మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలను వేసుకోవాలని, ఇందుకు ఆయిల్‌ఫామ్‌ సాగు అ నుకూలమని చెప్పారు. ప్రభుత్వం కూడా ప్రో త్సాహాన్ని అందిస్తుందన్నారు. జిల్లాలో రూ.221 కోట్ల రైతుబంధు సాయాన్ని అందించినట్లు తెలిపా రు. జడ్పీ చైర్మన్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ రై తులకు ఉచిత కరెంట్‌తో పాటు పంటలకు గిట్టు బాటు ధర కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆయిల్‌ సీడ్‌ కంపెనీతో ఒప్పందం చేసుకున్న రైతులకు ధ్రువీ కరణ పత్రాన్ని మంత్రి అందజేశారు. కలెక్టర్‌ ము షారఫ్‌ అలీ ఫారూఖీ, రైతుబంధు జిల్లా కన్వీనర్‌ వెంకట్రామ్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నర్మదా ముత్యంరెడ్డి, రవీందర్‌రెడ్డి, ఎంపీపీలు రామేశ్వర్‌ రెడ్డి, మహిపాల్‌, సురేఖ, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యులు డాక్టర్‌ సుభాష్‌రావు, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ రఘు నందన్‌రావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అం జిప్రసాద్‌, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, ఉద్యానవన శాఖ అధికారి శరత్‌బాబు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు
అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు
అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు

ట్రెండింగ్‌

Advertisement