e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home జిల్లాలు పల్లె ప్రగతి పనులపై నిర్లక్ష్యం వద్దు

పల్లె ప్రగతి పనులపై నిర్లక్ష్యం వద్దు

పల్లె ప్రగతి పనులపై నిర్లక్ష్యం వద్దు

ఆదిలాబాద్‌ డీపీవో శ్రీనివాస్‌
వననర్సరీ, పారిశుధ్య పనుల పరిశీలన
బజార్‌హత్నూర్‌, మే 17: పల్లె ప్రగతి పనులపై నిర్లక్ష్యం చేయవద్దని ఆదిలాబాద్‌ డీపీవో శ్రీనివాస్‌ అధికారులకు సూచించారు. మండలంలోని జాతర్ల, చింతల్‌స్వాంగి, గులాబ్‌తండా, బజార్‌హత్నూర్‌ గ్రామాల్లో చేపడుతున్న పల్లె ప్రగతి పనులను సోమవారం ఆయన పరిశీలించారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. అనంతరం పలు గ్రామాల్లో నర్సరీలు, పల్లె పార్కులు, పారిశుధ్య పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. వన నర్సరీలో పెరుగుతున్న మొక్కలపై గ్రీన్‌ మ్యాట్‌ కచ్చితంగా ఉండాలని, మొక్కలకు నీళ్లు పట్టాలని నిర్వాహకులకు సూచించారు. అంతకుముందు పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో మాట్లాడారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. ఆయన వెంట ఎంపీవో మహేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు సాయిప్రసాద్‌, భీంసేన్‌, పార్థు, ఈజీఎస్‌ సిబ్బంది ఉన్నారు.
కరోనా కట్టడికి మాస్క్‌ తప్పనిసరి
ఇచ్చోడ, మే 17: కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని ఆదిలాబాద్‌ డీపీవో శ్రీనివాస్‌ అన్నారు. మండల కేంద్రంలో లాక్‌డౌన్‌ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వార్డుల్లో మురుగు కాల్వలను శుభ్రం చేయాలని, కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాల గురించి ప్రచారం చేస్తూ ప్రజలకు వివరించాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఆయన వెంట సర్పంచ్‌ చౌహాన్‌ సునీత, ఎంపీవో రమేశ్‌, ఈవో నర్సారెడ్డి, సిబ్బంది ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పల్లె ప్రగతి పనులపై నిర్లక్ష్యం వద్దు

ట్రెండింగ్‌

Advertisement