e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home జిల్లాలు గిరి గ్రామాల అభివృద్ధికి కృషి

గిరి గ్రామాల అభివృద్ధికి కృషి

గిరి గ్రామాల అభివృద్ధికి కృషి

సొంత ఖర్చులతో అంబులెన్స్‌ ఏర్పాటు చేస్తా
పోడు భూముల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా
సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
మూడు గ్రామాల్లో పర్యటన

పెంచికల్‌పేట్‌ , జూన్‌ 16 : గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తానని సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. పెంచికల్‌పేట్‌ మండలంలోని గుండెపల్లి, కమ్మర్‌గాం, మురళీగూడల్లో బుధవారం ప్రత్యేకంగా బొలెరో వాహనంలో పర్యటించారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన మొరలిగూడ సర్పంచ్‌ భర్త, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు పోర్తెటి శంకర్‌ కుటుంబాన్ని పరామర్శించారు. పిల్లల చదువు బాధ్యత తనదేనని, కూతురు వివాహానికి రూ.2 లక్షలు అందిస్తానని హామీ ఇచ్చారు. ముందుగా పార్టీ కార్యకర్తలు విఠల్‌, గురుదాస్‌ కూతుళ్లకు కరోనా సమయంలో పెండ్లి కాగా, నూతన వస్ర్తాలు అందించి, ఆశీర్వదించారు. అనంతరం కమ్మర్‌గాం నుంచి మొరలిగూడ, జిల్లెడ గ్రామాలకు మంజూరైన త్రీ ఫేజ్‌ విద్యుత్‌ లేన్‌ పనులకు భూమి పూజ చేశారు. అలాగే గ్రామస్తుల కొరిక మేరకు నందిగాం, జిల్లెడ, మొరలిగూడ, కమ్మర్‌గాం, గుండెపల్లి గ్రామాలకు తన సొంత ఖర్చులతో ప్రత్యేక అంబులెన్స్‌ అందిస్తానని హామీ ఇచ్చారు. రైతుల పోడు భూముల సమస్యను సీ ఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు. అనంత రం ఎల్కపల్లికి చెందిన జునుగరి రమేశ్‌ ఇటీవల కరోనాతో మృతిచెందగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పిల్లల చదువుకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు పోర్తెటి ఈశ్వరి, జాజిమొగ్గ శ్రీనివాస్‌, దుర్గం రాజన్న, మధునయ్య, ఎంపీటీసీ శారద, టీఆర్‌ఎస్‌ మండల యువజన అధ్యక్షుడు చౌదరి తిరుపతి, కొండయ్య, మండల కోఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ సాజిద్‌, నాయకులు సముద్రాల రాజన్న, పుల్లూరి రామన్న, పూదరి వెం కటి, ఆలం సకారాం, భుజంగ్‌రావు, ఎస్‌కే బా బు, ఖైరాత్‌, తులసిరాం, బాపురావు, బాపన్న, వెంకటేశ్‌, కాగజ్‌నగర్‌ రూరల్‌ సీఐ రాజేంద్రప్రసాద్‌, ఎస్‌ఐలు రమేష్‌,రఘుపతి,పీఎస్‌ఐ రాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గిరి గ్రామాల అభివృద్ధికి కృషి
గిరి గ్రామాల అభివృద్ధికి కృషి
గిరి గ్రామాల అభివృద్ధికి కృషి

ట్రెండింగ్‌

Advertisement